TIMS : టిమ్స్‌లో ఇక సర్జరీలు.. నిమ్స్ తరహాలో తక్కువ ధరకే వైద్యం.!
- రోజుకు 600 మందికి ఓపీ సేవలు
- త్వరలోనే పూర్తిస్థాయి సర్జరీలకు గ్రీన్ సిగ్నల్
- నిమ్స్ తరహాలో చవకైన టారిఫ్‌లు
- మల్టీ లెవల్ పార్కింగ్, పీజీ హాస్టళ్లకు ఆమోదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TIMS : హైదరాబాద్ వాసులతో పాటు తెలంగాణ నలుమూలల నుంచి వచ్చే రోగులకు అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను మరింత చేరువ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్) ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తొలి సమావేశం ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన మంగళవారం నాడు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లో జరిగింది. ఈ భేటీలో ఆసుపత్రి అభివృద్ధి, కొత్త సేవల ప్రారంభం , మౌలిక వసతుల కల్పనకు సంబంధించి పలు ఆసక్తికరమైన నిర్ణయాలకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
త్వరలోనే సర్జరీలు ప్రారంభం.. రోజుకు 600 మందికి ఓపి
ప్రస్తుతం టిమ్స్ ఆసుపత్రికి ప్రతి రోజూ సగటున 600 మంది అవుట్ పేషెంట్లు వస్తున్నారని, వారికి నాణ్యమైన వైద్య సేవలతో పాటు డే కేర్ ప్రొసీజర్లను కూడా అందిస్తున్నామని డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్ మంత్రికి వివరించారు. రోగులకు మెరుగైన ఆపరేషన్ సేవలు అందించేందుకు ఆసుపత్రిలోని ఐసీయూలు, ఆపరేషన్ థియేటర్లు , డయాగ్నస్టిక్ పరికరాలను పూర్తిస్థాయిలో స్టెరిలైజేషన్ చేయిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే పూర్తిస్థాయి సర్జరీలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
Also Read
నిమ్స్ టారిఫ్‌లు, సర్వీస్ రూల్స్ అమలు
టిమ్స్‌లో వైద్యులు, సిబ్బంది నియామకాల కోసం నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) సర్వీస్ రూల్స్‌ను అనుసరించాలని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయించింది. దీనికి తోడు నిమ్స్‌లో అమలులో ఉన్న చవకైన, సమగ్రమైన టారిఫ్‌లనే టిమ్స్‌లో కూడా అమలు చేయడానికి ఆమోదం తెలిపారు. దీనివల్ల రెండు ప్రధాన ప్రభుత్వ వైద్య సంస్థల మధ్య చార్జీల విధానంలో ఏకరూపత రావడంతో పాటు, సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్యం తక్కువ ధరకే అందుబాటులోకి రానుంది. అలాగే ఆసుపత్రి ఆర్థిక లావాదేవీలను ట్రస్ట్ అండ్ రిటెన్షన్ అకౌంట్ (TRA) ద్వారా నిర్వహించేందుకు అవసరమైన బ్యాంకింగ్ సేవలను సమన్వయం చేసేందుకు ఈసీ ఆమోదముద్ర వేసింది.
మల్టీ లెవల్ పార్కింగ్, పీజీ హాస్టళ్ల నిర్మాణం
రోగులు, వారి సహాయకులు , ఆసుపత్రి సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులను భారీగా విస్తరించనున్నారు. ఆసుపత్రికి వచ్చే వాహనాల కోసం మల్టీ లెవల్ కార్ పార్కింగ్ ఏర్పాటుతో పాటు రోగుల సహాయకుల సౌకర్యార్థం అదనపు టాయిలెట్ కాంప్లెక్స్ నిర్మించే ప్రతిపాదనలకు ఈసీ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా, నిమ్స్ తరహాలోనే టిమ్స్‌లోనూ పీజీ మెడికల్ కాలేజీని ప్రారంభించనున్న నేపథ్యంలో, పీజీ వైద్య విద్యార్థుల కోసం ప్రత్యేక హాస్టళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్‌ను అత్యాధునిక వైద్యం, వైద్య విద్య , పరిశోధనలకు కేంద్ర బిందువుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, టీజీఎంఎస్ఐడీసీ ఎండీ డాక్టర్ గౌరవ్ ఉప్పల్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ వాణి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవిందర్ నాయక్, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ తదితర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?