US-Russia: రష్యాలో ల్యాండ్ అయిన అమెరికా మిలిటరీ విమానం.. ఏం జరుగుతోంది.?
- రష్యాలో ల్యాండైన అమెరికా మిలిటరీ విమానం..
- రాజధాని మాస్కోలో ల్యాండ్ కావడంపై అంతర్జాతీయంగా ఆసక్తి..
- ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో కీలక పరిణామం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Russia: అమెరికాకు చెందిన ఒక సైనిక విమానం మంగళవారం రష్యాలోని వృుకోవో ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న వేళ యూఎస్ విమానం రష్యాకు ఎందుకు వెళ్లిందనే ప్రశ్నలు వస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా, రష్యాల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్న సంతతి తెలిసిందే.
ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్రాడార్ ప్రకారం.. ఈ విమానం బోయింగ్ సీ-17 గ్లోబ్‌మాస్టర్ 3 అయి ఉండొచ్చని తెలుస్తోంది. ఈ విమానం ప్రత్యేకంగా యూఎస్ వైమానికదళం ఉపయోగించే భారీ సైనిక రవాణా విమానం. సైనిక సిబ్బంది, సైనిక పరికరాలు, వాహనాలను సుదూర ప్రాంతాలకు తరలించేందుకు దీనిని ఉపయోగిస్తారు. ఇది లాట్వియా రాజధాని రిగా నుంచి మాస్కో వెళ్లింది. విమానం ఉదయం సుమారు 8:50 గంటలకు రిగా నుంచి బయలుదేరి, 10 గంటల తర్వాత మాస్కోలో ల్యాండ్ అయింది.
Also Read
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
అయితే, ఈ విమానంలో ఎవరు వెళ్లారనే దానిపై స్పష్టత లేదు. అమెరికా, రష్యా ప్రభుత్వాలు ఈ విమానంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ విమానం ఆగస్టు 23న రిగాకు చేరుకుంది. అంతకుముందు ఇది అమెరికాలోని క్యాంప్ స్ప్రింగ్ నుంచి బయలుదేరినట్లు తెలుస్తోంది. ఇక్కడే అమెరికా కీలక సైనిక స్థావరమైన ఆండ్రూ ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది. దీనిక అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే ఎయిర్‌ఫోర్స్ వన్‌తో ఈ స్థావరానికి సంబంధం ఉంది.
ఈ విమానం రష్యాకు వెళ్లడం చూస్తే అమెరికాకు చెందిన ఉన్నతాధికారి పర్యటన అయి ఉండొచ్చనే అనుమానాలు వస్తున్నాయి. ప్రస్తుతం, రెండు దేశాల మధ్య సంబంధాలు సున్నితంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఒక అమెరికా సైనిక విమానం రష్యా రాజధానిలో ల్యాండ్ కావడం చూస్తే అంతర్జాతీయంగా ఆసక్తి పెరుగుతోంది.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!