CM Revanth Reddy : మూసీ ప్రాజెక్ట్‌పై రేవంత్ స్పీడ్.. అధికారులకు కీలక ఆదేశాలు..
- భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశం
- ల్యాండ్ పూలింగ్‌పై పారదర్శక నిబంధనలు
- ఫేజ్-2 పనులకు త్వరలోనే టెండర్లు
- పర్యాటక అభివృద్ధిపైనా సీఎం ప్రత్యేక ఫోకస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగర ప్రక్షాళనతో పాటు ప్రతిష్టాత్మక మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ ఉన్నతస్థాయి సమావేశంలో హెచ్ఎమ్డీఏ, జీహెచ్ఎమ్సీ, ఎంఆర్డీసీఎల్ కమిషనర్లు, ఎండీలు , రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. మూసీ ప్రాజెక్ట్ పురోగతిని సమీక్షించిన సీఎం, పనుల్లో వేగం పెంచాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
భూసేకరణ వేగవంతం.. ల్యాండ్ పూలింగ్‌పై స్పష్టత
మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ల్యాండ్ పూలింగ్ విధానంపై పారదర్శకమైన నిబంధనలను రూపొందించుకోవడంతో పాటు ఎఫ్టీఎల్ (FTL), బఫర్ జోన్ , అసైన్డ్ భూముల సేకరణ విషయంలో స్పష్టమైన విధానాన్ని తయారు చేసుకోవాలని ఆదేశించారు. భూసేకరణ సమయంలో భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
Also Read
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
- Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
- Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
ఫేజ్-2 టెండర్లు.. పర్యాటక రంగ అభివృద్ధి
మూసీ ప్రాజెక్ట్ ఫేజ్-2 పనులకు వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలని, ప్రాజెక్టుల నిర్మాణానికి అతి తక్కువ వడ్డీకి లభించే రుణాలపై మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. అంతేకాకుండా టీడీఆర్ (TDR) కేటాయింపులపై ప్రతి వారం సమీక్షలు నిర్వహించాలని తెలిపారు. ప్రాజెక్ట్‌తో పాటు పరిసర ప్రాంతాల పర్యాటక అభివృద్ధిపై ఫోకస్ పెట్టిన సీఎం, మంచిరేవులలోని ఓంకారేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి టెండర్లను తక్షణమే ఆహ్వానించాలని, కొత్వాల్‌గూడా బర్డ్స్ పార్క్‌కు ప్రచారం కల్పించి పర్యాటకులను ఆకట్టుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తాజావార్తలు
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
-
Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
-
Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..