శ్రీ రామానుజ సహస్రాబ్దిలో పాల్గొన్నారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. హైదరాబాద్ చేరుకున్న రామ్ నాథ్ కోవింద్ కు ఘన స్వాగతం లభించింది. బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కు స్వాగతం పలికారు గవర్నర్ తమిళ సై, సీఎం కేసీఆర్, మంత్రి తలసాని, మేయర్ విజయలక్ష్మి, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి. రాష్ట్రపతిని శాలువాతో సన్మానించారు సీఎం కేసీఆర్.