Medico Prethi Father: నిమ్స్ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న కేఎంసీ విద్యార్థిని ప్రీతి తాజా ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఉత్కంఠంగా మారింది. రాష్ట్రంలోనే కేఎంసీ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఇప్పటికి ప్రీతి ఆసుపత్రిలో చేరి మూడురోజులు కావస్తున్న గంట గంటకు తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలు సంచలనంగా మారాయి. ప్రీతి ఆరోగ్యం కన్నతండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రీతి ఆరోగ్య పరిస్తితిపై మంత్రి, అధికారులు అంతా స్టేట్‌మెంట్ లు తప్పుడు సమాచారం ఇస్తున్నారని మండిపడ్డారు. ప్రీతి ఆరోగ్య పరిస్తితిపై మంత్రి, అధికారులు తప్పుడు స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని ప్రీతి తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్మో మీదనే ట్రీట్మెంట్ నడుస్తోందని పేర్కొన్నారు. నిన్నటి నుంచి బెటర్ అని చెప్తున్నారు కానీ మాకు ఏమీ కనిపించలేదని అన్నారు. స్వతహాగా ప్రీతి శ్వాస తీసుకోవడం లేదని, ప్రీతి కళ్ళు తెరిచి చూడడం కానీ మాట్లాడటం కానీ ఏమీ లేవని తెలిపారు. వరంగల్ నుంచి ఎంత అత్యంత విషమంగా ప్రీతిని హైదరాబాద్ తీసుకొచ్చామని, ప్రస్తుతం ప్రీతీ పరిస్థితి కూడా అదే విధంగా ఉందని తండ్రి కన్నీరుమున్నీరయ్యారు. అడ్మినిస్ట్రేషన్ త్వరగా స్పందించి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదని వాపోయారు. సైఫ్ ను కఠినంగా శిక్షించాలి, ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ప్రీతి ఆరోగ్య పరిస్తితి పై మంత్రి, అధికారులు తప్పుడు స్టేట్‌మెంట్ లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రీతి కళ్ళు తెరిచి చూసింది
ఇది ఇలా ఉండగా.. వైద్య విద్యార్థిని ప్రీతిని గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ ఇవాల పరామర్శించారు. ప్రీతి ట్రీట్మెంట్ కు సహకరిస్తోందని తెలిపారు. గట్టీగా తట్టి లేపానని అన్నారు. దానికి ప్రీతి కళ్ళు తెరిచి చూసిందని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలు మేరకు ప్రీతికి వైద్య చికిత్సను అందిస్తున్నారని తెలిపారు. నైపుణ్యమైన, నాణ్యమైన వైద్య చికిత్స ను అందిస్తున్నామని అన్నారు. బాధ్యులైన వారు ఎవరైన సరే వదిలేప్రసక్తే లేదని పేర్కొన్నారు. కమిటీని ఏర్పాటు చేశాము, ఆ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రీతి హెల్త్ బులిటెన్..
నిమ్స్ ఆస్పత్రి వైద్యులు ప్రీతి హెల్త్ బులిటెన్ విడుదల చేసారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని తెలిపారు. డాక్టర్ ప్రీతి ఎక్మో మీదనే ఉంచామన్నారు. గుండె, కిడ్నీలలో ఫంక్షనింగ్ కొంత మెరుగుపడిందని తెలిపారు. ప్రీతి శరీరం చికిత్స కు సహకరిస్తుందని,
ఎక్మో పెట్టాము కాబట్టి మెడిసిన్ ద్వారా నిలకడగా ఉండేలా చూస్తున్నామన్నారు. ఆరోగ్య పరిస్థితి విషమమగానే ఉంది కాని ప్రీత ని కాపాడేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని, ప్రత్యేక డాక్టర్ల బృందం చికిత్స అందిస్తుందని వెల్లడించారు.
పోలీస్ స్టేట్మెంట్ లో ఏమన్నారంటే..
కేఎంసీ వేధింపుల కేసులో నింధితునిపై ర్యాగింగ్, అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. కాకతీయ మెడికల్ కళాశాల పిజి విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మ హత్య యత్నం కేసులో నింధితుడు సైఫ్ పై ఏస్సే, ఎస్టీ అట్రాసిటీ తోపాటు ర్యాగింగ్ కేసు నమోద చేశారు. నిందుతునిపై పలు కేసులు నమోదు చేశామని చెప్పారు. బాధితురాలు బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి ఈ కేసు నమోదు చేశామని తదుపరి విచారణ అనంతరం శాఖ పరమైన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా వివరించారు. తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం ముందు శిక్షార్హులే నని దోషులు ఎప్పటికైనా తప్పించు కోలేరని అన్నారు. సంస్థాగతంగా పూర్తి స్థాయిలో విచారణ లేకుండా సామాజిక మధ్యమాల్లో వస్తున్న సమాచారం సరైనది కాదని అందరూ సంయవనం పాటించాలని సూచించారు వరంగల్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ బోనాల కిషన్.
సైఫ్ కు మద్దతుగా నిరసనలు
ప్రీతి ఆత్మహత్య ఘటనలో సైఫ్ కు మద్దతుగా పేజీ విద్యార్థులు నిరసన తెలిపారు. తల్లిదండ్రుల ఒత్తిడితో తప్పుడు కేసులు పెట్టొద్దని డిమాండ్ చేశారు. జూనియర్లకు సూచన చేసే క్రమంలో చేసిన పోస్టింగ్ అనే వేధింపులుగా చేయొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు వద్దని ప్లకార్డులతో మెడికోలు నిరసన చేపట్టారు. సీనియర్లు.. జూనియర్లకు ఎలా చేయాలి నేర్పడం అనేది సహజమన్నారు. చిన్న మిస్టిక్ గనుక చేస్తే ఒక ప్రాణం కోల్పోవాల్సి వస్తుందని అన్నారు. వాటి గురించి చేసిన క్రమంలో అతని ఒక్కరిని టార్గెట్ చేసి కేసులు పెట్టడం సరైనది కాదని పీజీలు వైద్య విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Medico Prethi: కేఎంసీ విద్యార్థిని ప్రీతి ఘటన పూర్తి వివరాలు.. ఎవరెవరు ఏమన్నారంటే..