ప్రీతి ఆరోగ్యం కన్నతండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రీతి ఆరోగ్య పరిస్తితిపై మంత్రి, అధికారులు అంతా స్టేట్‌మెంట్ లు తప్పుడు సమాచారం ఇస్తున్నారని మండిపడ్డారు.
నిమ్స్ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న కేఎంసీ విద్యార్థిని ప్రీతి తాజా ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఉత్కంఠంగా మారింది. రాష్ట్రంలోనే కేఎంసీ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం హాట్ టాపిక్ గా అయ్యింది. అయితే ఇప్పటికి కేఎంసీ విద్యార్థిని ప్రీతి ఆసుపత్రిలో చేరి మూడురోజులు కావస్తున్న గంట గంటకు ప్రీతి ఆరోగ్యంపై వెలువడుతున్న వార్తలు సంచలనంగా మారుతున్నాయి.