Harish Rao: ప్రీతి కుటుంబ సభ్యులకు హరీశ్ పరామర్శ.. దోషులను శిక్షిస్తామని హామీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: మెడికో ప్రీతి ఘటన తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన విసయం తెలిసిందే.. నాలుగురోజుల నుంచి నిమ్స్ లో ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతన్న ప్రీతిని, తల్లిదండ్రులకు పరామర్శించేందుకు పలువురు నేతలు, రాజకీయ నాయకులు వచ్చి ధైర్యం చెబుతున్నారు. ప్రీతి తల్లిదండ్రులను ఓదార్చి ప్రీతికి సరైన వైద్యం అందిచేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని, ప్రీతి ఇలా ఉండడానికి కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తానని హామీ ఇస్తున్నారు. ఈనేపథ్యంలో నిమ్స్ లో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని ప్రీతిని శుక్రవారం ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. రెండు రోజుల జిల్లా పర్యటన ముగించుకొని శుక్రవారం రాత్రి హైదరాబాద్ కు వచ్చారు. అనంతరం నేరుగా నిమ్స్‌కు వెళ్లి ప్రీతి ఆరోగ్యంపై సమీక్ష నిర్వహించారు. ఆమెకు అందిస్తున్న వైద్యం గురించి, నిమ్స్ ఇంచార్జి డైరెక్టర్, చికిత్స అందిస్తున్న ప్రత్యేక వైద్య బృందాన్ని మంత్రి హరీశ్ రావు అడిగి తెల్సుకున్నారు.
Read also: Astrology: ఫిబ్రవరి 25, శనివారం దినఫలాలు
Also Read
అత్యుత్తమ వైద్యం అందించాలని, అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యులను ఆదేశించారు. ప్రీతి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చి, ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విచారణ పూర్తి నిష్పాక్షికంగా జరుగుతుందని, దోషులు ఎంతటివారైనా కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ప్రీతి తండ్రి చేతిలో చేయి వేసి సహనం కోల్పోవద్దని ప్రతీకి ఏమీ కాదని, ఓదార్చారు మంత్రి. కుటుంబ సభ్యులను ధైర్యం చేప్పిన అనంతరం నిమ్స్ నుంచి హరీష్ రావు బయలుదేరుతున్న సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. హరీశ్ రావు కారును ఎస్టీ సంఘం కార్యకర్తలు అడ్డుకున్నారు. హరీశ్ రావు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ప్రీతి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నాలుగు రోజులుగా ప్రీతి విషయం తెలిసినా ఏ నాయకుడు రాలేదని, ఇప్పుడు వచ్చి ఏం చేయాలని అంటూ మండిపడ్డారు. దీంతో నిమ్స్ ఆసుపత్రి వద్ద బీఎస్పీతో పాటు ఇతర సంఘాల కార్యకర్తలను పోలీసులు అదుపులో తీసుకున్నారు.
Bhakthi Tv Stothraparayanam Live: శనివారం ఈ స్తోత్ర పారాయణం చేస్తే..
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..