కామారెడ్డి : రేవంత్ రెడ్డి, బండి సంజయ్ పై మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. బండి సంజయ్ పాదయాత్ర పై స్పందించిన మంత్రి వేముల ప్రశాంత్.. ఎందుకోసం పాదయాత్ర చేస్తున్నావని.. రెండు వేల పెన్షన్ ఇస్తున్నారని పాదయాత్ర చేస్తావా ? అని బండి సంజయ్‌ని ప్రశ్నించారు. రైతు బంధు, ఉచిత విద్యుత్, కెసిఆర్ కిట్ లు ఇస్తున్నారని పాదయాత్ర చేస్తావా…? అని నిలదీశారు.
read also : కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ..
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో అమలవుతున్న స్కీములను ఒకటి చూపించి పాదయాత్ర చేయాలని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో ఉన్న రేవంత్ రెడ్డి… కేసీఆర్ నుండి అధికారాన్ని తీసుకుంటానని మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. ఎవరో ఇస్తే రాలేదు ప్రభుత్వం.. ప్రజలు ప్రజాస్వామ్యంగా ఆశీర్వదిస్తే వస్తుందన్నారు. రేవంత్ రెడ్డి ఒక దొంగ అని…ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడని మండిపడ్డారు.