Wine Shop Closed: మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. ఈనెల 25న వైన్ షాపులు బంద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wine Shop Closed: మందుబాబులకు హైదరాబాద్ పోలీసులు బ్యాడ్ న్యూస్ అందించారు. మద్యం షాపులు, బార్లు, పబ్బులు కొన్ని గంటల పాటు బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌లో ఆ ఒక్కరోజు కూడా మద్యం దొరకదు. ఎందుకంటే ఆ రోజు హోలీ పండుగ కారణంగా మూసివేస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని అన్ని మద్యం దుకాణాలు, బార్లు, పబ్బులను మూసివేయాలని పోలీసు శాఖ నిర్ణయించింది. ఈనేపథ్యంలోనే కల్లు దుకాణాలు కూడా మూసివేయబడతాయి. హోలీ సందర్భంగా ఈ నెల 25వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 26వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు, కల్లుదుకాణాలు, రెస్టారెంట్లు బంద్ చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. కొన్ని మాత్రమే అనుమతించబడతాయి. స్టార్ హోటల్స్ మరియు రిజిస్టర్డ్ క్లబ్‌లకు మినహాయింపు ఉంది. ఈ మేరకు ఆయా పోలీసు కమిషనరేట్ల కమిషనర్లు ఉత్తర్వులు జారీ చేశారు.
Read also: APMS Entrance: ‘ఇంటర్’ ప్రవేశాల కొరకు ఏపీ మోడల్ స్కూల్ నోటిఫికేషన్ జారీ..!
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
నిబంధనలు ఉల్లంఘించి బహిరంగంగా తాగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే మద్యం షాపులను ఎందుకు మూసివేస్తున్నారో హోలీకి తెలుసా? అంటూ దానికి గల కారణాలు తెలిపారు. పండుగ సమయంలో స్నేహితులు, బంధువులందరూ మద్యం సేవించి గొడవలు, వివాదాలకు దారి తీయకుండా ఉండేందుకు ముందుజాగ్రత్త చర్యగా మద్యం షాపులను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ హోలీ పండుగ సందర్భంగా మద్యం షాపుల బంద్‌తో పాటు పోలీసులు ప్రజలకు కొన్ని జాగ్రత్తలు, హెచ్చరికలు కూడా చేశారు. హోలీ పండుగను ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. ఇతరులపై బలవంతంగా రంగులు వేయకూడదని, ఇబ్బంది పెట్టకూడదని అన్నారు. రోడ్లపై బైక్‌లు నడుపుతూ అరాచకాలు సృష్టించవద్దని హెచ్చరించారు. పండుగల వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Gold Price Today : తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..