Ponnam Prabhakar: నిధులిస్తానని చెప్పి కేసీఆర్ ప్రజలకు శఠగోపం పెట్టారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhaskar Comments On CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మరోసారి ధ్వజమెత్తారు. అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలని కేసీఆర్ చెప్పారని, మరి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. ఇప్పుడున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లన్ననీ అగ్గిపెట్టేలా చిన్నగా ఉన్నాయని విమర్శించారు. హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో భాగంగా జగిత్యాల జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యను ప్రజలలోకి తీసుకెళ్లిందుకే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టామన్నారు. 609వ నంలో ఉన్న అదానిని.. ప్రపంచంలో 9 స్థానానికి బీజేపీ తీసుకొచ్చిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం రాకముందు ఉన్న అప్పు ఎంత? ఇపుడున్న అప్పు ఎంత? అని ప్రశ్నించారు.
Guntakal Mystery Cases: ఉలిక్కిపడ్డ గుంతకల్లు.. ఆ దారుణాలకు కారణమేంటి?
Also Read
- IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
- Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నట్టు.. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఎక్కడ లేదని, 10 గంటలే వస్తుందని పొన్నం ప్రభాకర్ అన్నారు. కరెంట్ తీగలను పట్టుకోమన్న టీఆర్ఎస్ ఛాలెంజ్‌ని తాము స్వాగతిస్తున్నామని, కరెంట్ తీగల్ని పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కార్యకర్తలు అనేక వేధింపులకు గురవుతున్నారన్నారు. వారిపై అక్రమ కేసులు పెట్టి, బైండోవర్లు చేయిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వంత జాగీరేమీ కాదని తేల్చి చెప్పారు. శ్రీరామ్ సాగర ప్రాజెక్ట్ నీళ్లు తెలంగాణ నుంచి మహారాష్ట్రకు ఎలా పంపిస్తావని కేసీఆర్‌ని ప్రశ్నించిన ఆయన.. శ్రీరామ్ సాగర్‌లో చుక్క నీరు ముట్టినా రక్తపు మరకలేనంటూ వార్నింగ్ ఇచ్చారు. దేవాలయాలకు నిధులు కేటాయిస్తానని చెప్పి.. దేవుళ్ళకు, ప్రజలకు శఠగోపం పెట్టారన్నారు. కొండగట్టులో బస్ ప్రమాదం జరిగితే.. బాధితుల్ని పరామర్శించేందుకు కేసీఆర్ రాలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై కాంగ్రెస్ కార్యకర్తలు ఛార్జ్ షీట్ చేసి.. ఎన్నికల్లో ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.
Pavitra: మా నాన్న చనిపోయాడని తెలిసి సంతోషించా.. జబర్దస్త్ నటి సంచలన వ్యాఖ్యలు
అంతకుముందు.. తన రాజకీయ స్వార్థం కోసం గోదావరి నీళ్లను కేసీఆర్ బలి చేస్తున్నారని పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీరు మహారాష్ట్రకు తోడుకొమ్మని కేసీఆర్ చెప్పడం.. తెలంగాణకు తీరని ద్రోహం చేయడమే అవుతుందన్నారు. శ్రీరామ సాగర్‌ను మహారాష్ట్ర చేతికిస్తే.. ప్రాజెక్టు పరివాహక ప్రాంతం స్మశానం అవుతుందన్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ ప్రాంతాలు ఎడారిగా మారిపోతాయని పేర్కొన్నారు. తెలంగాణ హక్కుగా ఉన్న ప్రాజెక్టును మహారాష్ట్రకు అప్పగిస్తానంటే, కేసీఆర్‌ను ప్రజలు ఛీ కొడతారంటూ మండిపడ్డారు.
తాజావార్తలు
-
Mohan Babu: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను దారుణంగా మోసం చేశాడు.. నాని ముందే బాంబ్ పేల్చిన మోహన్ బాబు!
-
Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
-
Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
-
CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?