అవకాడోలో ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్-బి అధికంగా ఉంటుంది. దీనిని తినడం వల్ల ఎన్నో రకాల వ్యాధులు దూరమవుతాయి.
అవకాడోలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
బరువు తగ్గాలనుకునేవారు, అధిక బరువు సమస్యతో బాధపడేవారు అవకాడోనూ రోజూవారి ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పండు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలో ఉంటాయి.
విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఇందులోఎక్కువగా ఉంటాయి.
అవకాడోిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. తద్వారా గుండె జబ్బులు వచ్చే ప్రమాదంతగ్గుతుంది.
ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరంలో నొప్పులు, వాపులను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.
అవకాడోలో ఫోలేట్, పొటాషియం వంటి మూలకాలు ఎక్కువగా ఉంటాయి. గర్భిణులు, పాలిచ్చే తల్లులకు ఇవి మేలు చేస్తాయి. పాల ఉత్పత్తిని పెంచడంలో సాయపడతాయి.
క్యాన్సర్ నివారణకు, చర్మాన్ని యవ్వనంగా ఉంచేందుకు కూడా ఈ ఫలం ఉపకరిస్తుంది.