Ponnala Lakshmaiah: కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళు భూములు.. విల్లాలు ఇస్తే టికెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో పార్టీని అమ్మకానికి పెట్టారని మండిపడ్డారు. వ్యాపార సంస్థగా పీసీసీ మార్చేశారని పీసీసీ మాజీ చీఫ్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఖర్గేకి లేఖ రాశారు. టిక్కెట్ల కేటాయింపులో బీసీలకు పార్టీ అన్యాయం చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగామ టికెట్ విషయంలో పొన్నాల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి జనగామ టిక్కెట్టు ఇస్తారనే ప్రచారం జరుగుతున్న వేళ అసహనంతో పొన్నాల లక్ష్మయ్య పార్టీకి రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. పార్టీ గొప్ప సింద్ధాంతాలు రాసుకుంటామని, ఒక కుటుంబానికి ఒకటే సీటు అంటారని అన్నారు. అది అందరికీ వర్తించదని,
ఓ అనామకుడు సర్వేలు చేయడ, మీ పేరు లేదంటే మాలాంటి వాళ్ళు కూడా మౌనంగా ఉండాల్సి రావడం బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు పార్టీ పదవులు ఇచ్చినందుకు ధన్యవాదాలని అన్నారు. అవమానాలు పడుతూ పార్టీలో భాగస్వామ్యం అవ్వాలని అనుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో తనకు అవమానం జరిగిందంటూ పొన్నాల లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్‌ఎస్ లో పొన్నాల చేరున్నట్లు సమాచారం. వైఎస్ కేబినెట్ లో నీటిపారుదల మంత్రిగా పొన్నాల పనిచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తొలి పీసీసీ చీఫ్‌గా పొన్నాల లక్ష్మయ్య పనిచేశారు.
Read also: Infosys: ఫలితాల తర్వాత పతనమైన ఇన్ఫోసిస్ షేర్లు.. రూ. 4300 కోట్ల నష్టం
బాధతో పార్టీ కి రాజీనామా చేస్తున్నానని అన్నారు. 2014 ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా పార్టీ ఓడిపోయిందని అన్నారు. కానీ నన్ను రాజీనామా చేయించి బలి పశువుని చేసింది పార్టీ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. 2018 లో కూడా పార్టీ ఒడిపోయిందని, కానీ అప్పటి నాయకులను మాత్రం రాజీనామా చేయాలని అడగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్లుగా పార్టీ భావజాలానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పార్టీలో మేము పరాయి వాళ్ళము అయ్యామని అన్నారు. రేవంత్ రెడ్డి ఎక్కడైనా కనిపించినా నమస్తే పెడితే కూడా స్పందించడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మూల సిద్ధాంతం సామాజిక న్యాయంకి పాతర పడిందని అన్నారు. బీసీ నాయకుల టికెట్లు ఎగ్గొట్టే కుట్ర జరుగుతుందని అన్నారు. సర్వేల పేరుతో.. సీట్లు ఎగ్గొట్టే కుట్ర జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో లేని వ్యక్తులు గెలుస్తారని చెప్తున్నారు, పార్టీలో ఉన్న బీసీ నేతలు ఓడిపోయే వాళ్ళు అనే ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. నా లాంటి సీనియర్ నేత మాట్లాడాలి అంటే అపోయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని బాధపడ్డారు. బీసీ నేతలు 50 మంది వచ్చి ఏఐసీసీ అపాయింట్ మెంట్ కోరితే.. అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.
Vicky Kaushal: ఇండియాస్ బెస్ట్ బయోపిక్… టీజర్ కి సెల్యూట్ కొట్టాల్సిందే