Ponguleti Srinivas Reddy : తెలంగాణలో ఇళ్లు లేని వారికి గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి..
- జూన్ 2న ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత ప్రారంభం
- పాత లబ్ధిదారులకు మరో అవకాశం కల్పించిన ప్రభుత్వం
- ఫారెస్ట్-రెవెన్యూ భూముల వివాదాలపై ప్రత్యేక చర్యలు
- అసైన్డ్ ల్యాండ్స్, సాదాబైనామా సమస్యలకు పరిష్కారంపై హామీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponguleti Srinivas Reddy : తెలంగాణలో సొంతింటి కల కలిగిన పేదలకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఆదిలాబాద్ జిల్లా వేదికగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ‘ఇందిరమ్మ ఇళ్ల’ రెండో విడత కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించబోతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. శనివారం మీడియాతో జరిపిన ప్రత్యేక చిట్‌చాట్‌లో ఆయన ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పాటు రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు కీలక రెవెన్యూ సమస్యలపై స్పష్టతనిచ్చారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన పాత ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్‌లో లబ్ధిదారులుగా ఉండి, రకరకాల కారణాల వల్ల ఇప్పటివరకు ఇళ్లు పూర్తి చేసుకోని వారికి ఈ విడతలో ప్రభుత్వం మరో అద్భుతమైన అవకాశం కల్పించబోతోందని మంత్రి పొంగులేటి ప్రకటించారు. అర్హులైన ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలనేదే ప్రభుత్వ ఆశయమని, నిబంధనల ప్రకారం పెండింగ్ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు వీలుగా లబ్ధిదారులకు తగిన సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్‌కు రేపే డెడ్‌లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్‌కు హరీశ్ రావు లేఖ..!
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
రెవెన్యూ శాఖలో ప్రజాప్రతినిధులు ప్రధానంగా మూడు రకాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారని, వాటి పరిష్కారానికి యుద్ధప్రతిపాదికన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ముఖ్యంగా అటవీ (ఫారెస్ట్) , రెవెన్యూ భూములకు సంబంధించిన బోర్డర్ వివాదం సుదీర్ఘకాలంగా నడుస్తోందని గుర్తు చేశారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తక్షణమే సరిహద్దులను (Borders) ఖరారు చేయాలని డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్లకు (DFO) ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఇందులో భాగంగా అత్యాధునిక రోవర్ల (Rovers) సహాయంతో అటవీ భూములను పూర్తిస్థాయిలో సర్వే చేసి, ఆ నివేదికను సంబంధిత జిల్లా కలెక్టర్లకు సమర్పించేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.
రాష్ట్రంలో అసైన్డ్ భూములకు సంబంధించిన పట్టాలు చేతిలో ఉండి, క్షేత్రస్థాయిలో సాగు చేసుకోవడానికి భూమి లేని నిర్పేదలను గుర్తించి, వారికి తగిన భూమిని చూపించాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు సూచించినట్లు మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. దీంతో పాటు రెవెన్యూ ప్రైవేట్ ల్యాండ్స్ సమస్యలపై కూడా ప్రజాప్రతినిధులు కోరిన విధంగా త్వరలోనే సరైన పరిష్కారం చూపిస్తామన్నారు. సామాన్యులకు ఎంతో కాలంగా భారంగా మారిన సాదాబైనామా (రిజిస్ట్రేషన్ లేని సాదా కాగితాల లావాదేవీలు) అంశాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి ‘భూ భారతి’ పోర్టల్‌లో చేర్చిందని, ఈ పెండింగ్ భూ సమస్యలన్నింటినీ అతి త్వరలోనే పూర్తిస్థాయిలో పరిష్కరించి రైతులకు, భూ యజమానులకు ఊరట కలిగిస్తామని మంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
తాజావార్తలు
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్‌గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
-
Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
-
Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!