Site icon NTV Telugu

BJP V/s TRS: ఒక్కసారిగా పెరిగిన పొలిటికల్ హీట్.. అటు వాళ్లు.. ఇటు వీళ్లు

Trs Bjp

Trs Bjp

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రయోగశాలగా వేదిక‌గా తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకుంది. అయితే.. రెండు రోజుల సమావేశాలు మాదాపూర్ హెచ్ఐసీసీలోని నోవాటెల్ హోటల్లో ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు స్వాగతం పలికేందుకు బీజేపీ భారీ కటౌట్లు, ప్లెక్సీలు ఏర్పాటుచేసిన విష‌యం తెలిసిందే. ఈనేప‌థ్యంలో.. టీఆర్ఎస్ సైతం అదే స్థాయిలో నిరసనలు తెలపడానికి, తెలంగాణ రాష్ట్ర ప్రగతిని తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. అయితే ఈపబ్లిసిటీ స్టంట్.. మాటల యుద్ధం రెండు రోజులకే పరిమితమవుందా అనే ప్ర‌శ్న‌, లేక సమావేశాల్లో తెలంగాణ మీద చేసే తీర్మానంతో రాజకీయ వేడి ప్రారంభమవుతుందా.. అన్నది ఆసక్తికరంగా మారింది.

కాగా.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా, టీఆర్ఎస్ కు మాత్రం సవాలుగా మారాయి. ఈ నేప‌థ్యంలో.. పై చేయి సాధించేందుకు రెండు పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈనేప‌థ్యంలో.. ఒక పార్టీ ఫ్లెక్సీలు, బ్యానర్లు, తోరణాలను మరో పార్టీ కార్యకర్తలు చించేయడం మొదలైంది. కాగా.. రెండు పార్టీల మధ్య మాటలయుద్ధం కాస్తా చేతల్లోకి వెళ్లిపోయింది. అయితే.. ఒకే రోజున ఇటు యశ్వంత్ సిన్హా ప్రోగ్రామ్లో కేసీఆర్ స్పీచ్.. దాని తర్వాత జాతీయ కార్యవర్గ సమావేశాల్లో సాయంత్రానికి ప్రధాని మోడీ స్పీచ్ ఉండటం గమనార్హం. వీరిద్ద‌రు పోటాపోటీగా జరుగుతున్న రెండు పార్టీల యాక్టివిటీ రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని వేడిక్కిస్తుంది.

read also: COVID 19: దేశంలో కొత్తగా 17,092 కేసులు..29 మరణాలు

అయితే తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని, కేసీఆర్ పాలనకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని బీజేపీ నేతలు గంభీర ప్రకటనలు చేస్తున్నారు. కాగా.. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా కేంద్ర మంత్రులు, జాతీయ స్థాయి నాయకులు రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇది స్టార్టింగ్ పాయింట్ అని వ్యాఖ్యానించారు.

ఈ నేప‌థ్యంలో.. తెలంగాణకు తీరని అన్యాయం చేసిన బీజేపీ ఏ ముఖం పెట్టుకుని నగరానికి, రాష్ట్రానికి వచ్చిందని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ గడ్డమీద సమావేశం పెట్టుకునే కమలనాథులు పెండింగ్లో ఉన్న అంశాలపై నిర్దిష్టమైన హామీలు ఇవ్వాలని మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ ద్వారా ప్రధానిని డిమాండ్ చేసిన విష‌యం తెలిసిందే..

P Madhu: వైసీపీ ఏపీని వల్లకాడు చేస్తోంది.. టీడీపీ, జనసేన కలిసి రావాలి..!

Exit mobile version