Jammu Kashmir: జమ్మూకాశ్మీర్ వరస ఎన్‌కౌంటర్లతో అట్టుడుకుతోంది. బుధవారం నుంచి కాశ్మీర్ ప్రాంతంలో ఏదో చోట ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంటుంది. శనివారం బారాముల్లా ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ ప్రారంభం అయింది. మరోవైపు రాజౌరీలో శుక్రవారం నుంచి ఎన్‌కౌంటర్ కొనసాగుతూనే ఉంది. రాజౌరీ ఎన్‌కౌంటర్ ఇప్పటికే 9 పారా కమాండో దళానికి చెందిన నలుగురు జవాన్లు, సైన్యానికి చెందిన ఒకరు మొత్తం ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రయోగశాలగా వేదికగా తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకుంది. అయితే.. రెండు రోజుల సమావేశాలు మాదాపూర్ హెచ్ఐసీసీలోని నోవాటెల్ హోటల్లో ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు స్వాగతం పలికేందుకు బీజేపీ భారీ కటౌట్లు, ప్లెక్సీలు ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో.. టీఆర్ఎస్ సైతం అదే స్థాయిలో నిరసనలు తెలపడానికి, తెలంగాణ రాష్ట్ర ప్రగతిని తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. అయితే ఈపబ్లిసిటీ స్టంట్.. మాటల యుద్ధం రెండు రోజులకే పరిమితమవుందా అనే ప్రశ్న, లేక…