దేశంలో రాష్ట్రపతి ఎన్నికల గడువు సమీపించింది. సోమవారమే కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ పరిస్థితుల్లో తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఊహించినట్టే యశ్వంత్ సిన్హాకు తన మద్దతు తెలిపింది.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రయోగశాలగా వేదికగా తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకుంది. అయితే.. రెండు రోజుల సమావేశాలు మాదాపూర్ హెచ్ఐసీసీలోని నోవాటెల్ హోటల్లో ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు స్వాగతం పలికేందుకు బీజేపీ భారీ కటౌట్లు, ప్లెక్సీలు ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో.. టీఆర్ఎస్ సైతం అదే స్థాయిలో నిరసనలు తెలపడానికి, తెలంగాణ రాష్ట్ర ప్రగతిని తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. అయితే ఈపబ్లిసిటీ స్టంట్.. మాటల యుద్ధం రెండు రోజులకే పరిమితమవుందా అనే ప్రశ్న, లేక…
వరుసగా కేంద్రంలో అధికారంలో ఉంటున్న బీజేపీ.. ఈ ఏడాది జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ ను ఎంచుకుంది. దీంతో హైదరాబాద్ లో నేటి నుండి మూడు రోజుల పాటు సాగే జాతీయ కార్యవర్గ సమావేశాలకు జాతీయ నాయకులు అందరూ హాజరు కానున్నారు. ప్రధాని మోడీతో పాటు అమిత్ షా, నితిన్ గడ్కరీ, రాజ్ నాథ్ సింగ్ లాంటి అగ్రనేతలు అందరూ ఈ సమావేశాలకు హాజరు కానున్నారు. అయితే.. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి తరఫున పోటీలో నిలిచిన…
నేడు భాగ్యనగరానికి విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రానున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్టుకు యశ్వంత్ సిన్హా చేరుకుంటారు. సిన్హాకు స్వాగతం పలికేందుకు స్వయంగా తెలంగాణ సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. అనంతరం బేగం పేట్ నుంచి యశ్వంత్ సిన్హాకు మద్దతుగా టిఆర్ఎస్ శ్రేణులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించానున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి యశ్వంత్ సిన్హా భోజనం చేయనున్నారు. అనంతరం 3.30 గంటలకు ఐటీసీ కాకతీయలో ఎంఐఎం ఎంపీ, ఎమ్మెల్యేలతో…
రాష్ట్రపతి అభ్యర్తి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ రానున్న నేపథ్యంలో.. ప్రగతిభవన్‌లో నగరంలోని ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ గురువారం ఉదయం భేటీ అయ్యారు. రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు జూలై 2న స్వాగత ఏర్పాట్లపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో బేగంపేట నుంచి జలవిహార్ వరకు భారీ ర్యాలీకి టీఆర్ఎస్ ప్లాన్‌ను సిద్ధం చేస్తోంది. సీఎం కేసీఆర్ టీఎర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి జలవిహర్‌లో.. యశ్వంత్ సిన్హా భోజనం చేయనున్నారు. అయితే.. ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు…