ఆంధ్రప్రదేశ్ నర్సీపట్నం _అన్నవరం-విజయవాడ-సూర్యాపేట మీదుగా గంజాయి తరలిస్తున్న నిందితుడు వనపల్లి నాగసాయి అరెస్ట్ చేశారు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. దీని పై హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ… నగరంలో ఉన్న ఏజెంట్ల సాయంతో గంజాయి విక్రయిస్తున్న నిందితుడు… దేశంలోని పలు నగరాల్లో ఉన్న స్థానిక ఏజెంట్ల తో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసాడు నిందితుడు. అవసరం ఉందని ఆర్డర్ రాగానే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గంజాయి సాగు చేసే వారితో డీల్ చేస్తాడు. కమిషన్ పై స్థానిక ఏజెంట్లకు సరఫరా చేస్తున్నాడు నాగసాయి. సాగు చేసే వారి నుంచి 1500లకు కొని ఇక్కడ 5నుంచి 10వేలకు విక్రయిస్తున్నాడు నిందితుడు.
ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్ లో ఉన్న గంజాయి ట్రేడర్స్ తో సంబంధాలు ఉన్నాయి. నిందితుడి పై అంబర్ పెట్, మలక్ పేట్ పొలీస్ స్టేషన్ల లో కేసులు ఉన్నాయి. తాజాగా నారాయణ్ ఖేడ్ కి చెందిన ప్రేమ్ సింగ్ నుంచి గంజాయి ఆర్డర్ తీసుకున్నాడు నాగసాయి. రెండు లక్షల అడ్వాన్స్ తీసుకుని 40 కేజీల గంజాయి సరఫరా చేస్తుండగా పట్టుకున్నారు పోలీసులు.