Pocharam Case : పోచారం కాల్పుల కేసులో ప్రధాన నిందితుడు ఇబ్రహీం, మరో ఇద్దరు అరెస్ట్
- పోచారం కాల్పుల కేసులో ఇబ్రహీం సహా ముగ్గురు నిందితుల అరెస్ట్
- టాస్క్‌ఫోర్స్ ముందు లొంగిపోయిన నిందితులు
- గోవుల అక్రమ రవాణా అడ్డుకున్న ప్రశాంత్‌పై హత్యాయత్నం
- ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే ఇబ్రహీంపై కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pocharam Case : పోచారం కాల్పుల ఘటనలో ప్రధాన నిందితుడు ఇబ్రహీం సహా మరో ఇద్దరు నిందితులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి ఈ ముగ్గురు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసుల ముందు లొంగిపోయారు. అనంతరం టాస్క్ ఫోర్స్ అధికారులు వారిని రాచకొండ పోలీసులకు హ్యాండ్‌ఓవర్ చేశారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన ఈ కాల్పుల కేసు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసు నిందితులను పోలీసులు నేడు మీడియా ముందుకు తీసుకురానున్నారు.
వివరాల ప్రకారం.. బాధితుడు ప్రశాంత్ సోను గత పది రోజుల్లో నాలుగు సార్లు గోవుల అక్రమ రవాణాను అడ్డుకున్నాడు. దీనివల్ల ఆ గ్యాంగ్‌పై అతనికి శత్రుత్వం ఏర్పడింది. ఇబ్రహీం అనే వ్యక్తి శ్రీనివాస్ అనే వ్యక్తి ద్వారా ప్రశాంత్‌కు ఫోన్ చేసి, పోచారం ప్రాంతానికి రమ్మని పిలిపించుకున్నాడు. అక్కడే హత్యాయత్నానికి ప్రణాళిక వేసి, కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు.
Also Read
- TG SAFE: హైదరాబాద్లో అక్రమ డైరీ దందా గుట్టురట్టు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
ఇబ్రహీం అండ్ గ్యాంగ్ ప్రశాంత్‌ను హత్య చేయాలనే ఉద్దేశ్యంతో ఈ దాడి జరిపినట్లు దర్యాప్తులో తేలింది. ఇబ్రహీంపై ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే గోవుల అక్రమ రవాణా కేసు నమోదై ఉంది. ప్రస్తుతం రాచకొండ పోలీసులు నిందితులను కస్టడీలోకి తీసుకుని మరింత విచారణ చేపడుతున్నారు. ఈ ఘటన వెనుక ఉన్న మిగతా వ్యక్తుల పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.
Bihar Elections: ఇండియా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్.. కాసేపట్లో ఉమ్మడి ప్రకటన
తాజావార్తలు
-
TG SAFE: హైదరాబాద్లో అక్రమ డైరీ దందా గుట్టురట్టు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Vaibhav Sooryavanshi: పాపం వైభవ్ సూర్యవంశీ.. తొక్కేస్తున్న గౌతమ్ గంభీర్.. ఇదే సాక్ష్యం!
-
CNAP Service: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నవంబర్ 1 నుంచి ఫోన్లలో కాలర్ పేరు ప్రత్యక్షం!
-
Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
-
Supreme Court: “మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు”.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!