Electricity Bill Reduction : ఇలా చేస్తే మీ కరెంట్ బిల్లు సున్నా!
- సూర్యఘర్ పథకానికి తెలంగాణలో భారీ స్పందన
- సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు కేంద్రం సబ్సిడీ
- 1 నుంచి 3 కిలోవాట్ల వరకు.. మీ ఇంటికి ఏది సరిపోతుంది?
- మిగులు విద్యుత్‌తోనూ బిల్లు తగ్గించుకోవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణ హితమైన సౌర విద్యుత్ వినియోగాన్ని భారీగా ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’కు ప్రజల నుంచి అపూర్వమైన ఆదరణ లభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ పథకం కింద ఏకంగా 44,662 దరఖాస్తులు రాగా, అందులో 29,816 దరఖాస్తులకు ఇప్పటికే ఆమోదం లభించింది. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో జోన్లో రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థల ఏర్పాటుకు నగరవాసులు విశేష ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటివరకు వేల సంఖ్యలో దరఖాస్తులు అందగా, తనిఖీలు పూర్తి చేసుకున్న లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వ సబ్సిడీ సైతం జమ అవుతుండటంతో కరెంట్ బిల్లులను సున్నా చేసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి.
అర్హతలు , స్థల కేటాయింపు వివరాలు
ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే దరఖాస్తుదారుడికి తప్పనిసరిగా సొంత ఇల్లు, యాక్టివ్ విద్యుత్ కనెక్షన్ ఉండాలి. అలాగే సోలార్ ప్యానెళ్లను అమర్చుకోవడానికి తగినంత పైకప్పు (రూఫ్‌టాప్) స్థలం అందుబాటులో ఉండాలి. గతంలో ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి సోలార్ సబ్సిడీని పొంది ఉండకూడదు. సాధారణంగా ఒక కిలోవాట్ సామర్థ్యం గల సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే సుమారు 80 నుంచి 100 చదరపు అడుగుల స్థలం అవసరమవుతుంది. అర్హులైన ఆసక్తి గల గృహయజమానులు అధికారిక వెబ్సైట్ ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read
- WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
- Kavitha : బతుకమ్మ సాక్షిగా కవిత కీలక ప్రకటన.. మహిళలకు 50 శాతం సీట్లు..
- Anganwadi Recruitment : వికారాబాద్ జిల్లాలో అంగన్వాడీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..!
- Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
కుటుంబ అవసరాలకు తగినట్లుగా సోలార్ సామర్థ్యం
ఇంట్లోని విద్యుత్ వస్తువుల వినియోగాన్ని బట్టి సరైన సామర్థ్యం గల సోలార్ వ్యవస్థను ఎంచుకోవడం ముఖ్యం. తక్కువ కరెంట్ వాడే చిన్న కుటుంబాలకు ఒక కిలోవాట్ సోలార్ ప్లాంట్ సరిపోతుంది. దీని ద్వారా రోజుకు సుమారు 4 నుంచి 5 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యి ఎల్ఈడీ బల్బులు, ఫ్యాన్లు, టీవీ, చిన్న ఫ్రిజ్ వంటి పరికరాలు సజావుగా నడుస్తాయి. ఇక మధ్యతరగతి కుటుంబాలు రెండు కిలోవాట్ల వ్యవస్థను ఎంచుకోవడం ద్వారా రోజుకు 8 నుంచి 10 యూనిట్ల విద్యుత్ పొందవచ్చు. దీనివల్ల బల్బులు, ఫ్యాన్లతో పాటు కూలర్, వాషింగ్ మెషీన్ , పగటిపూట ఒక టన్ను ఇన్వర్టర్ ఏసీని కూడా నడపవచ్చు. ఒకవేళ ఏసీలు, వాటర్ మోటార్లు వంటివి ఎక్కువగా వాడే పెద్ద ఇళ్లకైతే మూడు కిలోవాట్ల సోలార్ ప్లాంట్ అనుకూలంగా ఉంటుంది. దీనిద్వారా రోజుకు 12 నుంచి 15 యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి లభిస్తుంది.
భారీ సబ్సిడీ.. మిగులు విద్యుత్‌తో అదనపు లాభం
సోలార్ ప్యానెళ్ల కొనుగోలు , ఇన్‌స్టాలేషన్‌కు అయ్యే ప్రారంభ ఖర్చులో కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ వినియోగదారులకు పెద్ద ఉపశమనం ఇస్తోంది. ఒక కిలోవాట్ వ్యవస్థకు సుమారు రూ. 30 వేలు, రెండు కిలోవాట్లకు రూ. 60 వేలు, అలాగే మూడు కిలోవాట్లు లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వ్యవస్థలకు గరిష్ఠంగా రూ. 78 వేల వరకు సబ్సిడీ నేరుగా లభిస్తుంది. అంతేకాకుండా, ఇంటి అవసరాలకు మించి ఉత్పత్తి అయిన మిగులు విద్యుత్‌ను ‘నెట్ మీటరింగ్’ విధానం ద్వారా తిరిగి గ్రిడ్‌కు పంపించడం ద్వారా కరెంట్ బిల్లులో సర్దుబాటు ప్రయోజనం పొందవచ్చు. ప్రభుత్వ సబ్సిడీలు, తగ్గుతున్న విద్యుత్ ఖర్చులు అన్నీ కలిసి రావడం వల్ల గృహ వినియోగదారులు తమ నెలవారీ కరెంట్ బిల్లులను సున్నాగా మార్చుకోవడానికి ఇదొక అద్భుతమైన అవకాశంగా మారుతోంది.
తాజావార్తలు
-
Electricity Bill Reduction : ఇలా చేస్తే మీ కరెంట్ బిల్లు సున్నా!
-
Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు… సీట్లు దక్కేదెవరికి…?
-
Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
-
Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
-
LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?