PM Modi: బెంగాల్ ఉత్సాహం తెలంగాణలో కూడా కనిపిస్తోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: తొలిసారిగా పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని, బెంగాల్‌లో ఎలాంటి ఉత్సాహాన్ని చూశామో, తెలంగాణలో కూడా అదే ఉత్సాహం కనిపిస్తోందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఆదివారం తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన భారీ బహిరంగ సమావేశంలో పాల్గొన్నారు. నా ప్రియమైన తెలంగాణ ప్రజలారా అంటూ తెలుగులో ప్రధాని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. బెంగాల్ ప్రజలు మమతా బెనర్జీ, లెఫ్ట్ పార్టీలను తిరస్కరించారని ఆయన అన్నారు. మమత నియంతృత్వం నుంచి బెంగాల్ విముక్తమైందని అన్నారు.
Read Also: Warren Buffett: ‘అమ్మా.. నీ కోపమే నన్ను ప్రపంచ విజేతను చేసింది’.. వారెన్ బఫెట్
Also Read
కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ అవినీతి రాజ్యమేలుతుందని ప్రధాని మోడీ విమర్శలు చేశారు. ఆబ్ కీ బార్ బీజేపీ సర్కార్ తెలంగాణలో కూడా వినిపిస్తోందని చెప్పారు. తెలంగాణ యువత ప్రేమను నా కళ్లతో చూస్తున్నాని అన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ విస్తరిస్తోందని అన్నారు. పదేళ్ల క్రితం బెంగాల్‌లో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ఉండేవారని, ఇప్పుడు 200కు పైగా ఎమ్మెల్యేలు ఉన్నారని అన్నారు. ఒకప్పుడు బీజేపీ కార్యకర్తలు కూడా లేని బెంగాల్‌లో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిందని అన్నారు. ఒకప్పుడు బీజేపీకి ఇద్దరు ఎంపీలు ఉండేవారని, ఒకరు తెలంగాణ వారే అని ఆయన గుర్తు చేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని ఆయన అన్నారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని బీజేపీ నమ్ముతుందని, దేశ అభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. తెలంగాణకు వేల కోట్ల నిధులు ఇస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌ను అన్ని రకాలుగా కేంద్రం అభివృద్ధి చేస్తుందని వివరించారు. వచ్చ ఎన్నికల్లో తెలంగాణలో భారీ మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
The Hundred Women’s Champions: కావ్య మారన్‌కు నిరాశ.. ఫైనల్లో సన్‌రైజర్స్‌పై ట్రెంట్ రాకెట్స్ విజయం.!
-
Ananya Raj: 27 ఏళ్లకే నటి అనన్య రాజ్ మృతి.. నెల తర్వాత బయటపడ్డ విషాదం
-
The Hundred Men’s Champions: టిమ్ సీఫర్ట్ విధ్వంసం.. తొలిసారి ‘ది హండ్రెడ్’ ఛాంపియన్స్‌గా మాంచెస్టర్ సూపర్ జెయింట్స్.!
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి డబ్బేడబ్బు!
-
Iran Commander: ఇరాన్ కమాండర్ సంచలన ప్రకటన.. అమెరికా సైనికులను పట్టుకున్నా లేదా చంపినా 30,000 డాలర్ల బహుమతి
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?