Harassment: వివాహితకు ఓ వ్యక్తి నుంచి రోజూ కాల్స్.. ఆ వ్యక్తి కాల్స్ ను బ్లాక్ చేసిన.. వేరే నెంబర్లతో ఫోన్ చేయడం. వేధింపులకు గురిచేయడం. వద్దంటూ ప్రాధేయపడినా ..మళ్లీ కాల్స్ చేసి వారికి కావాల్సింది ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేయడం. ఇలా వివాహితులే టార్గెట్ గా ఫోన్ కాల్ వేధింపులు ఎక్కువగా అవడంతో ఇంట్లో చెప్పలేక.. భర్తతో పంచుకోలేక వివాహితులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. కుటుంబసభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చుతున్నారు. ఇలాంటి ఘటనే మంచీర్యాల జిల్లా లక్షెట్టిపేటలో చోటుచేసుకుంది.
Read also: Off The Record: గద్వాల టీఆర్ఎస్‌లో కొత్త రగడ..
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకట్రావు పేటకు చెందిన రోజారాణి అనే వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అదే గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తి నాలుగు నెలల నుండి తరచూ ఫోన్ చేసి వేధిస్తున్నాడని ఆమె ఈ ఘాతుకానికి పాల్పడింది. నంబర్ బ్లాక్ చేసినా రమేష్ వేరే నంబర్ల నుండి ఫోన్ చేసి వేధించడంతో మనస్థాపం చెందిన రోజారాణి సూసైడ్ చేసుకుంది. మృతురాలి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివాహిత అయిన రోజారాణికి అసలు రమేష్ ఎలా పరిచయం అయ్యాడు. ఆమె ఫోన్ అతనికి ఎలా తెలిసింది అనే కోణంలో విచారణ చేపట్టారు. అసలు వివాహిత అయిన రమేష్ ఎందుకు వేధించే వాడని? ఫోన్ నెంబర్ బ్లాక్ చేసిన కాల్స్ ఎందుకు చేసేవాడని? తండ్రికి రమేష్ గురించి ముందే తెలుసా? తెలిస్తే మరి అప్పుడే పోలీసులకు రమేష్ పై ఎందుకు ఫిర్యాదు చేయాలేదు అనే కోణంలో విచారణ చేపట్టారు.
Peru Plane Crash: టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే ప్లేన్ క్రాష్.. సెల్ఫీ తీసిన జంట