Salaar: ‘సలార్’ ఊహించని అప్డేట్… గేమ్ ఆఫ్ థ్రోన్స్ రేంజులో కొత్త యూనివర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక్కో రోజుని లెక్కపెడుతూ సెప్టెంబర్ 28 కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. సలార్ సినిమా థియేటర్లోకి రావడమే ఆలస్యం, అన్నిరికార్డులు లేస్తాయని అందరూ ఫిక్స్ అయిపోయారు. ట్రేడ్ వర్గాలైతే… సలార్ కలెక్షన్స్ ధాటిని బాక్సాఫీస్ తట్టుకుంటుందా? అనేలా ఇప్పటి నుంచే లెక్కలు వేస్తున్నారు. ఏ మాత్రం బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా ఇప్పటి వరకున్న ఇండియన్ సినిమాల రికార్డులన్నీ సలార్ తుడిచిపెట్టేయడం ఖాయం. ఈ ఏడాదిలో మోస్ట్ వైలెంట్ మ్యాన్‌గా ప్రభాస్ ఊచకోత ఉండబోతోంది. ప్రశాంత్ నీల్ ఈ సినిమాను ఓ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నాడు. అయితే.. యాక్షన్ సినిమాలకే బాప్‌లా సలార్ ఉండబోతోందని లేటెస్ట్ అప్టేడ్ ఒకటి బయటకి వచ్చి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా శృతి హాసన్ నటిస్తుండగా… వెటరన్ బ్యూటీ శ్రీయా రెడ్డి కూడా కీ రోల్ ప్లే చేస్తోంది. ఇప్పటికే ఆమెకు సంబంధించిన షూటింగ్ పార్ట్ కూడా కంప్లీట్ అయింది. గతంలో తనను అప్రోచ్ అయ్యి, ఒప్పించిన ప్రశాంత్ నీల్‌కి థాంక్స్ చెప్తూ స్పెషల్ పోస్ట్ చేసింది శ్రీయ రెడ్డి. ఇక ఇప్పుడు సలార్ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది.
ఇప్పటి వరకు సలార్… రెండు కెజియఫ్ సినిమాలు కలిస్తే ఎలా ఉంటాయో, అలా ఉంటుందని అనుకున్నారు కానీ అంతకుమించి అనేలా భారీ యాక్షన్ ఎలిమెంట్స్‌తో సలార్‌ను తెరకెక్కిస్తున్నాడట ప్రశాంత్ నీల్. ఏ రేంజ్‌లో అంటే.. హాలీవుడ్ సెన్సేషనల్ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ రేంజ్‌లో ఓ సరికొత్త వరల్డ్ క్రియేట్ చేశాడట. గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ గురించి అందరికీ తెలిసిందే. ఈ సిరీస్ వరల్డ్ వైడ్‌గా సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ సిరీస్ ఇంపాక్ట్‌తోనే సలార్ రాబోతోందని శ్రియా రెడ్డి చెప్పడం సినిమాపై అంచనాలు పెంచే విషయమే. ఈ లెక్కన సలార్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక ఇటీవలే శ్రియా రెడ్డి ‘సలార్’ షూటింగ్ పూర్తి చేసిన సందర్భంగా.. ఈ సినిమాలో పనిచేసిన తన సిబ్బందికి బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏదేమైనా.. సెప్టెంబర్ 28న ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర చరిత్ర సృష్టించబోతోంది సలార్ సినిమా.
Also Read
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!