Paripoornananda Swami Meet Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ని పరిపూర్ణానంద స్వామి కలిశారు. నిన్న జరిగిన పరిణామాలు అరెస్ట్.. అనంతరం విడుదల కేసు విషయమై వివరాలపై భేటీ అయ్యారు. కేసు వివరాలను ఆరాతీసిన ఆయన రాజాసింగ్‌ను పరామర్శించారు.అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ దేశం చరిత్ర, వారసత్వ సంపదను, ప్రతి దేశానికి వాళ్ళ వాళ్ళ సంప్రదాయలు గొప్పవని తెలిపారు. కొన్ని అవగాహన లోపాలు, గిల్లి కజ్జాలు జరుగుతూ ఉంటాయని పేర్కొన్నారు. వెయ్యి ఏళ్లుగా హిందూ సమాజంపై దాడులు జరుగుతున్నాయని సంచళన వ్యాఖ్యలు చేశారు.
ప్రతీ ఒక్కరూ ఇది ఒప్పుకోవాలని సూచించారు. ఏ హిందూ ఏ దేశం పై దాడి చెయ్యలేదని స్పష్టం చేశారు. ఇప్పుడు అప్రమత్తం అయ్యి మాట్లాడే ప్రయత్నం చేస్తే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పొలీస్, కోర్టులు కొంచం ఇది అర్థం చేసుకోగలరని తెలిపారు. పార్టీ గురుంచి తను మాట్లాడను, వాళ్ళ నిర్ణయాలు వాళ్ళకీ ఉంటాయని పేర్కొన్నారు. హిందూవులు మైనారిటీలుగా బ్రతకాల్సి వస్తుందని తెలిపారు. రాజా సింగ్ ఎప్పుడు మహ్మద్ ప్రవక్త గురించీ మాట్లాడలేదని పేర్కొన్నారు. ఇటలీలో వాటికన్ సిటీ ఉంది, దానికి అంటూ ఒక ధర్మం ఉందని గుర్తు చేశారు. పోలీసులు కుడా ప్రభ్యతముపై ధర్నా చేస్తారు. అప్పుడు ఎలా నోరు నోక్కుతారు? అంటూ ప్రశ్నించారు.
Muralidhar Rao: అన్ని మాఫియాలకు అడ్డాగా టీఆర్ఎస్ పార్టీ.. బీజేపీతో పెట్టుకుంటే ఉండరు