Muralidhar Rao comments on TRS party: రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ పట్ల వ్యతిరేకత ఉందని.. అన్ని మాఫియాలకు అడ్డాగా టీఆర్ఎస్ పార్టీ మారిందని విమర్శించారు బీజేపీ నేత, మధ్యప్రదేశ్ బీజేపీ ఇంఛార్జ్ మురళీధర్ రావు. మొత్తం టీఆర్ఎస్ కండ బలం, ధన బలం ఉపయోగించినా..దుబ్బాకలో ఓడిపోయిందని..కోట్ల రూపాయలు ఖర్చు చేసినా హుజురాబాద్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలిచారని అన్నారు. వాగ్ధానాలతో మోసపోయిన ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. ప్రాణాలు అర్పించడానికి బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజాశీర్వాదం ఉన్న పార్టీ బీజేపీ అని ఆయన అన్నారు.
టీఆర్ఎస్ పార్టీ గుండాలతో బెదిరించి భయపెట్టాలని చూస్తే అది మీ పగటి కలే అవుతుందని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు పాటిస్తుంటే వాటిని ప్రశ్నిస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అని.. మద్యపాన నిషేధం ప్రశ్నిస్తుందని, పల్లెల్లో బెల్ట్ షాపులు పెరిగిపోయాయని ఆయన అన్నారు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ లో 70 శాతం టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీలు ఉన్నాయని.. నిరుద్యోగ భృతి గురించి పోరాడుతోందని అన్నారు. తెలంగాణలో బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేయని రోజూ లేదని.. బీజేపీ ప్రతీకారం తీర్చుకునే పార్టీ… మర్చిపోయే పార్టీ కాదని హెచ్చరించారు.
Read Also: Bandi Sanjay: ప్రజా సంగ్రామ యాత్ర ఆపే ప్రసక్తే లేదు..!
ఈ రాష్ట్రంలో నేర్చుకున్న అనుభవాలతో దేశం మొత్తం అమలు చేయాలని మాఫియాను తయారు చేసింది నిజం కాదా..? కవిత ఇన్వెస్టిగేషన్ ఉందని అంటోందని.. ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు లేదా..? అని అన్నారు. రాబోయే రోజుల్లో అగ్గి మీద నిలబెట్టి నాట్యం చేయించే రోజులు వస్తాయని..గతంలో అద్వానిని జైల్ లో పెడితే బయటికి వచ్చాక కాంగ్రెస్ కు ఏ గతి పట్టిందో గుర్తు చేసుకోవాలని.. అన్నారు. దశాబ్ధాల పోరాటం చేసే కార్యకర్తల ఉన్న పార్టీ బీజేపీ అని అన్నారు.
బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను ఆపే హక్కు మీకు లేదని.. బీజేపీ పెట్టుకుంటే రాబోయే రోజుల్లో మీరుండరని.. బండి సంజయ్ కి భేషరతుగా క్షమాపణలు చెప్పి సంగ్రామ యాత్రకు పర్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ వ్యక్తి కాదని.. శక్తి అని అన్నారు. ఈ నెల 27న జేపీ నడ్డాను రప్పించి సభ నిర్వహించి తీరుతామని అన్నారు. బీజేపీ మాత్రమే టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని ప్రజలు నమ్ముతున్నారని.. కొత్త నాయకులతో రాబోయే రోజుల్లో ప్రభంజనం సృష్టిస్తాం అని మురళీధర్ రావు అన్నారు.