Telangana Govt: తెలంగాణ రాష్ట్రంలోని కులవృత్తులు, చేతివృత్తుల వారికి ఆర్థిక సాయం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కుల వృత్తులకు, చేతి వృత్తులకు రూ. లక్ష ఆర్థిక సాయం చేస్తామని ముఖ్యమంత్రి కె చంద్ర శేఖరరావు ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ ప్రకటన అనంతరం ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. మార్గదర్శకాలకు సంబంధించిన జీవోను బీసీ సంక్షేమ శాఖ తరపున జీవో ఎంఎస్ నంబర్5ను మంగళవారం జారీ చేశారు. కుటుంబంలో ఒక్కరికి రూ.లక్ష ఆర్ధిక సాయం చేయనున్నారు. జూన్ 2, 2023 నాటికి 18 నుంచి 55 ఏళ్ల వయస్సు లోపు వారు అర్హులుగా ఉత్తర్వులో పేర్కొన్నారు.
Read also: Maharashtra: విషాదం.. గోడకూలి ముగ్గురు కార్మికులు మృతి
తెలంగాణ రాష్ట్రంలోని బీసీలకు చేయూత నివ్వడం కోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా
వెనుకబడిన వర్గాలకు చెందిన కులవృత్తులు, చేతివృత్తులకు వారికి 1 లక్ష రూపాయల ఆర్థిక సాయం పై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా కుటుంబంలో ఒక్కరికి రూ. లక్ష ఆర్ధిక సాయం చేస్తారు. రూ. లక్ష ఆర్థిక సాయం పొందడం కోసం లబ్ధిదారులు జూన్ 2, 2023 నాటికి 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల లోపు ఉన్న వారు అర్హులు. ఆర్థిక సాయం పొందాలనుకునే వారు గడిచిన 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం నుండి ఆర్ధిక సాయం పొందినవారు అనర్హులు. ఆర్థిక సాయం పొందే వారి వార్షిక ఆదాయం రూ. 1 లక్ష 50 వేలు గ్రామీణ ప్రాంతాల్లో రూ. 2 లక్షల లోపు పట్టణ ప్రాంతాల్లో ఆదాయం ఉన్నవారు అర్హులు.
Read also: Viral Video: కేఎస్ భరత్తో అశ్విన్ రచ్చ.. తెలుగు నేర్పించాలంటూ ఓ పట్టుపట్టాడు.. వీడియో తెగ వైరల్
దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. దరఖాస్తులను ఈనెల 6వ తేదీ నుండి 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. మండలం, మున్సిపాలిటీల్లో ఆన్‌లైన్‌లో వచ్చిన అప్లికేషన్లను ఎంపిడిఓ, మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఈనెల 20 వ తేదీ నుండి 26వ తేదీ లోపు పరిశీలన చేసి కలెక్టర్‌కు నివేదికను సమర్పిస్తారు. దరఖాస్తుల్లో అర్హులను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ.. ఆ జిల్లా ఇంచార్జ్ మంత్రి ని అర్హుల జాబితాపై ఈనెల 27 నుండి వచ్చే నెల 4 లోపు అనుమతి తీసుకోవాలి. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అప్రూవ్ చేసిన అనంతరం అర్హుల జాబితాను జిల్లా, మండల, గ్రామ పంచాయతీ స్థాయిలో వెబ్ సైట్ లో పొందుపర్చాలని పేర్కొంటూ ఉత్తర్వులను జారీ చేశారు.