Operation Muskaan : ‘ఆపరేషన్ ముస్కాన్’ సక్సెస్.. 6,307 మంది చిన్నారులకు కొత్త జీవితం.!
- ఆపరేషన్ ముస్కాన్–12తో భారీ రెస్క్యూ
- 124 ప్రత్యేక బృందాల విస్తృత తనిఖీలు
- 1,710 మంది అరెస్ట్.. రూ.37.95 లక్షల జరిమానా
- వేలాది చిన్నారులకు పునరావాసం.. కుటుంబాలతో కలయిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన , అనాథ, వీధి బాలల సంరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మరొకసారి అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్ర సీఐడీ (CID) విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆపరేషన్ ముస్కాన్–12’ ద్వారా జూలై 1 నుంచి జూలై 31 వరకు చేపట్టిన నెల రోజుల సుదీర్ఘమైన ప్రత్యేక డ్రైవ్‌లో రికార్డు స్థాయిలో మొత్తం 6,307 మంది చిన్నారులను పోలీసులు సురక్షితంగా రెస్క్యూ చేశారు.
124 ప్రత్యేక బృందాలు.. విస్తృత తనిఖీలు
ఈ ఆపరేషన్ కోసం సీఐడీ విభాగం రాష్ట్రవ్యాప్తంగా 124 ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించింది. సుమారు 620 మంది పోలీసు సిబ్బందితో కూడిన ఈ బృందాలు హోటళ్లు, దాబాలు, నిర్మాణ ప్రదేశాలు, ఇటుక బట్టీలు, వర్క్‌షాప్‌లు, వ్యాపార దుకాణాలపై రాత్రింబవళ్లు విస్తృత తనిఖీలు నిర్వహించాయి. రక్షించబడిన 6,307 మంది చిన్నారులలో 5,892 మంది బాలురు, 415 మంది బాలికలు ఉన్నారు. వీరిలో తెలంగాణకు చెందినవారు 3,447 మంది ఉండగా, దేశంలోని ఇతర రాష్ట్రాలు , నేపాల్‌కు చెందినవారు 2,860 మంది కావడం గమనార్హం.
Also Read
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
- CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
నిర్బంధాలు, వీధి బాలల రక్షణ
పోలీసులు రక్షించిన చిన్నారుల్లో అత్యధికంగా 5,041 మంది వివిధ చోట్ల బాల కార్మికులుగా కష్టపడుతుండగా, 647 మంది వీధి బాలలుగా, మరో 43 మంది భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ ఈ ఆపరేషన్ ద్వారా పోలీసులు మొత్తం 1,705 ఎఫ్ఐఆర్లు (FIR) నమోదు చేసి, 1,710 మంది నిందితులను అరెస్ట్ చేశారు. అంతేకాకుండా, కార్మిక శాఖ అధికారులు 1,381 ఇన్సపెక్టోరియల్ రిపోర్టులు జారీ చేయడంతో పాటు, కనీస వేతనాల చట్టం కింద నిందితులకు ₹37.95 లక్షల జరిమానా విధించారు.
తల్లిదండ్రుల చెంతకు చిన్నారులు.. పునరావాస చర్యలు
రెస్క్యూ చేసిన చిన్నారుల్లో 5,737 మందిని అధికారులు వారి వారి కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించి, కళ్లలో ఆనందాన్ని నింపారు. కుటుంబ నేపథ్యం సరిగ్గా లేని లేదా అనాథలైన 570 మంది చిన్నారులను మెరుగైన భవిష్యత్తు , సంరక్షణ కోసం చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లకు (Child Care Institutions) తరలించారు. చిన్నారుల హక్కులను కాపాడుతూ, వారి భవిష్యత్తుకు వెలుగులు నింపడంలో తెలంగాణ పోలీసులు చూపుతున్న చొరవను పలువురు అభినందిస్తున్నారు.
తాజావార్తలు
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!