BIG Breking: తెలంగాణలో ఒక ఉపాధ్యాయుడు, ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది. ఈ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 16న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 23 వరకు నామినేషన్లకు గడువు ఉంది.మార్చి 13న ఎన్నికల పోలింగ్ జరగనుంది. 16న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆయా ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థులు ఇప్పటికే ప్రచారంలో నిమగ్నమయ్యారు. పీఆర్టీయూ అభ్యర్థి చెన్నకేశవ రెడ్డి, యూటీఎఫ్ అభ్యర్థి మాణిక్ రెడ్డి, ఎస్టీయూ అభ్యర్థి భుజంగరావు, బీజేపీ అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి తమ పేర్లను ప్రకటించారు. టీపీఆర్టీయూ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి పేరును ప్రకటించారు.
Read also: Fire Accident: సికింద్రాబాద్ రైల్ నిలయం వద్ద అగ్నిప్రమాదం.. మంటలు చెలరేగడంతో..
కాగా.. మరోవైపు ఏపీలోని 13 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది..స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు మూడు, పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయులు, 8 ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు కడప-అనంతపురం-కర్నూలు పట్టభద్రుల నియోజకవర్గం, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ పట్టభద్రుల నియోజకవర్గం ఉన్నాయి. అలాగే ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గాలు, కడప-అనంతపురం-కర్నూలు ఉపాధ్యాయ నియోజకవర్గాలు. అనంతపురం, కడప, నెల్లూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటికి సంబంధించి ఈ నెల 16న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. మార్చి 13న పోలింగ్, 16న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
Telangana Assembly: శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ.. నేటి నుంచి 3 రోజుల పాటు