ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా విష ప్రచారం జరుగుతుంది.. అంతే కాదు.. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ను దెబ్బతీసేలా కూడా పోస్టులు పెడుతున్నారట.. అయితే, ఏపీ బ్రాండ్ దెబ్బతీసేలా వస్తున్న కొన్ని సోషల్ మీడియా పోస్టింగులపై చంద్రబాబు ప్రభుత్వం సీరియస్‌గా ఉంది.. ఏపీలో పెట్టుబడులు పెట్టొద్దనే రీతిలో సోషల్ మీడియా పోస్టులు పెడుతున్న వారిపై నిఘా పెట్టింది సర్కార్.
ల్యాండ్ మాపియాకు పోలీసులు చెక్ పెట్టనున్నారు. భూ కబ్జాలు, ఫోర్జరీ పత్రాలు సృష్టించి అమాయకులను సతాయించే ల్యాండ్ మాఫియాలకు సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రత్యేక దృష్టి సారించారు. వారి వ్యవహారాలకు చెక్ పెట్టేందుకు సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగంను పటిష్టం చేశారు. ఈ నేపథ్యంలో సీపీ ఈవోడబ్ల్యూ విభాగానికి కొంతమంది నిపుణులను జోడించారు. దర్యాప్తు అధికారులతో పాటు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ చట్టాలపై పూర్తి అవగాహన ఉన్న వారిని ఎంపిక చేసుకుని ల్యాండ్ మాఫియా…