Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Off The Record Over Cm Revanth Reddy 5

Off The Record : కొత్త పాలనకు సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్

Published Date :December 14, 2025 , 11:08 pm
By Gogikar Sai Krishna
  • ఈనెల 17 తర్వాత పెద్ద ఎత్తున ఐఎఎస్‌ల బదీలీలు?
  • సంక్షేమ పథకాల అమలు కోణంలో సమర్థతకు ప్రాధాన్యత
  • చాలా శాఖల్లో ఇప్పటికీ పాత ఉన్నతాధికారులే
  • ఈసారి నాన్‌ ఫోకల్‌ పోస్టుల్లో ఉన్నవాళ్ళు సైతం బదిలీ
Off The Record : కొత్త పాలనకు సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్
  • Follow Us :
  • google news
  • dailyhunt

పరిపాలన మీద పూర్తి స్థాయిలో పట్టు బిగించేందుకు తెలంగాణ సీఎం కసరత్తు మొదలుపెట్టారా? పాత వాసనలు లేకుండా అడ్మినిస్ట్రేషన్‌ను గాడిలో పెట్టాలని డిసైడయ్యారా? అందు కోసం ఎక్స్‌ట్రా కేర్‌ తీసుకోబోతున్నారా? ఏంటా ప్రత్యేక జాగ్రత్తలు? ముఖ్యమంత్రి రేవంత్‌ ఏం చేయబోతున్నారు? తెలంగాణలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈనెల 17న మూడో విడత పోలింగ్‌ ముగియగానే ఎన్నికల కోడ్ ముగుస్తుంది. ఆ వెంటనే పెద్ద ఎత్తున ఐఎఎస్‌ అధికారులను బదిలీ చేసి… పరిపాలనా ప్రక్షాళనకు సిద్ధమవుతున్నారట సీఎం రేవంత్‌ రెడ్డి. పదవి చేపట్టాక తొలినాళ్ళలో ఉండే బాలారిష్టాలను అధిగమించడం, తర్వాత వరుస ఎన్నికల్లాంటి వాటితో ఇన్నాళ్ళు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదదని, ఇక మీదట ఆ సమస్య నుంచి బయటపడాలనుకుంటున్నట్టు సమాచారం. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు పూర్తి స్థాయిలో అందాలంటే సమర్ధులైన అధికారులు ఉండాలన్న లక్ష్యంతో ఐఎఎస్‌లను బదిలీ చేయాలనుకుంటున్నారట. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ళయింది. ఇప్పటి వరకు చాలా శాఖల్లో ఉన్నతాధికారులను మార్చలేదు. ఇప్పటి వరకు ఫోకల్ పోస్టుల్లో ఉన్న ఐఏఎస్ లనే మారుస్తూ వచ్చిన ప్రభుత్వం, ఈసారి నాన్ ఫోకల్ పోస్టుల్లో ఉన్న వారికి కూడా స్థాన చలనం కల్పించేందుకు సిద్దమైనట్టు తెలుస్తోంది.ఇక నుంచి పాలనను పరుగులు పెట్టించాలని భావిస్తున్నారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు కొన్ని సర్దుబాట్లు చేసుకునేందుకు సమయం ఇచ్చారని,ఇకపై పాలనలో తన ముద్ర వేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నతాధికారుల బదిలీలు చేపట్టాలని అనుకుంటున్నట్టు చెబుతున్నాయి సచివాలయ వర్గాలు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయి నుంచి కింది వరకు అందర్నీ మార్చాలని నిర్ణయించుకుని ఆయా శాఖల నుంచి నివేదికలు సిద్ధం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారట ముఖ్యమంత్రి.

ఆయన బాధ్యతలు తీసుకున్నాక కొన్ని శాఖలపై రివ్యూ నిర్వహించి ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు అధికారులకు స్థాన చలనం కల్పించారు. అంతేగాక సీఎంవోలోకి కొంతమంది అధికారులను తీసుకుని వారితో పని చేస్తూ వస్తున్నారు. రెండేళ్లు గడుస్తున్నా ఆరు గ్యారెంటీలపై ఉన్నతాధికారులు ప్రజల్లో నమ్మకం కల్పించకపోతున్నట్టు భావిస్తున్నారట ముఖ్యమంత్రి. దీంతో సెక్రటేరియట్‌లో కూడా కొంతమంది సీనియర్‌ ఐఎఎస్‌లకు స్థానచలనం తప్పదని తెలుస్తోంది.
సీఎంవో కార్యదర్శులను సైతం మార్చే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. పలు విషయాల్లో ముఖ్యమంత్రిని తప్పుదారి పట్టించిన సీఎంవో అధికారిని సైతం బదిలీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆ అధికారే గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. ఇప్పటిదాకా కాంగ్రెస్‌ సర్కార్‌లో కూడా ఆయన మాటే ఫైనల్ అన్నట్టు నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో మరో సీనియర్‌ ఐఏఎస్‌ను సీఎంవోలోకి తీసుకుని కీలక భాద్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సీఎంవోలో తీసుకుంటున్న నిర్ణయాలు వెంటనే బయటకు తెలిసి పోవడంపై ముఖ్యమంత్రి ఆగ్రహంగా ఉన్నారట. లోపలి వాళ్ళే కొందరు బయటకు లీకులు ఇస్తున్నారని, వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించినట్లు సమాచారం. అలాగే… పలు జిల్లాల్లో వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్న కలెక్టర్లు, కేవలం క్యాంపు ఆఫీసులకే పరిమితం అయి ప్రజల మధ్యకు వెళ్లని వాళ్ళను కూడా మార్చబోతున్నారు. పనితీరు ఆధారంగా రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టర్లకు గ్రేడింగ్, ర్యాకింగ్ ఇస్తున్నారు. ఈ క్రమంలో పర్ఫార్మెన్స్ బాగోలేని కలెక్టర్లను పక్కకు పంపే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితమే కొద్ది మంది ఐఏఎస్ లను రహస్యంగా బదిలీ చేసింది ప్రభుత్వం. విషయం బయటకు పొక్కకుండా ట్రాన్స్ ఫర్ ఆర్డర్స్ నేరుగా సదరు అధికారులకు పంపించారు. మరోవైపు ఐఎఫ్ఎస్ అధికారులను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. రాష్ట్రంలో డిప్యుటేషన్ పై పని చేస్తున్న ఐఆర్ఎస్ అధికారి, సింగరేణి సిఎండి బలరాం నాయక్ ను కూడా మార్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెలాఖరుతో ఆయన డిప్యుటేషన్ ముగిసిపోతుంది. రాబోయే మూడేళ్ళలో ప్రభుత్వం చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఫోకస్‌ చేయాలనుకుంటున్నారు ముఖ్యమంత్రి. అందుకోసం విజన్ ఉన్న అధికారులకు ప్రాధాన్యం ఇచ్చి పని చేయించాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CM Revanth Reddy
  • NTV Telugu
  • OTR

తాజావార్తలు

  • Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!

  • Chia Seeds : మధుమేహానికి చెక్ పెట్టే చియా సీడ్స్.. షుగర్ లెవల్స్ తగ్గాలంటే ఇలా తిని చూడండి!

  • Women Reservation: అంకెల్లో గెలిచి.. అధిక్యంలో ఓడి.. బిల్లు వీగిపోవడం వెనుక ఉన్న కారణాలివే..

  • Reed Hastings: సొంత కంపెనీ నుంచి తప్పుకున్న ఫౌండర్.. నెట్‌ఫ్లిక్స్‌లో ముగిసిన ‘రీడ్ హేస్టింగ్స్’ శకం

  • Womens Reservation Bill: నారీ శక్తి బిల్లుపై ఓటమి.. మరి మిగిలిన రెండు బిల్లుల సంగతేంటి?

ట్రెండింగ్‌

  • రాత్రి పడుకునే ముందు శరీరంలోని ఈ రెండు భాగాలకు ఆవనూనెతో ఎందుకు మర్దన చేయాలి?

  • Burning Feet Hacks: పాదాల్లో మంటలా..? ఇంటి చిట్కాలతో ఇలా చెక్ పెట్టండి.!

  • Neem Juice: వేప రసం తాగుతున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే.!

  • Health Tips : వర్కౌట్ బట్టల్లో ప్రాణాంతక రసాయనాలు.. ఫిట్‌నెస్ కోసం వెళ్తే అనారోగ్యం ఫ్రీ.!

  • Train Ticket Rules: రైలు ప్రయాణికుల టెన్షన్‌కు ఇక సెలవు.. అమల్లోకి కొత్త చార్ట్ రూల్స్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions