Balmuri Venkat: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు లక్ష రూపాయలు ఇవ్వాలని ఎన్ ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. గ్రూప్ -1 నోటిఫికేషన్ పై హైకోర్టు తీర్పుపై స్పందించారు. తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్ లో జరిగిన అవకతవకల వల్లే బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయడంలో విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్ 1 నోటిఫికేషన్ తెలంగాణ ప్రభుత్వ తప్పిదమని ఆరోపించారు. ఒక్కో అభ్యర్థికి రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులను, ప్రభుత్వ పెద్దలను జిల్లాల వారిగా అడ్డుకుంటామని హెచ్చరించారు. TSPSC పారదర్శకంగా పని చేయాలని కోరారు. యువతకు న్యాయం జరిగేలా చేయూతనివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. హైకోర్టులు మూడు అంశాలను పరిగణనలోకి తీసుకున్నాయన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీని గెలిపించి యువత సమస్యలు పరిష్కరిస్తామని బల్మూరి వెంకట్ అన్నారు.
Read also: Mynampally: మైనంపల్లి హనుమంత రావు నివాసంలో కాంగ్రెస్ కార్యర్తల సందడి..
గ్రూప్ వన్ పరీక్షలపై బలుమూరు వెంకట్ హైకోర్టును ఆశ్రయించారు. బల్మూర్ వెంకట్ పిటిషన్ పైనే హైకోర్టు తీర్పు ఇచ్చింది. గ్రూప్ వన్ పరీక్షలు రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. గ్రూప్ వన్ పరీక్షల్లో మళ్ళీ నిర్వహించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూన్ 11వ తేదీన నిర్వహించిన పరీక్షలు రద్దు చేసింది. బయోమెట్రిక్ విధానంతో పాటు ఓఎంఆర్ విధానంలో అవకతవకలపై పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం పరీక్షలను సక్రమంగా నిర్వహించలేదని వెంకట్ అన్నారు. నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని అన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. టీఎస్పీఎస్సీ తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు. గ్రూప్-1 లో, బయోమెట్రిక్ విధానం లేకపోవడం, అవకతవకలు జరిగాయని హైకోర్టు భావించి రద్దు చేసిందన్నారు. ఇప్పటికైనా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరగాలన్నారు. విద్యార్థులు మనోధర్యం కోల్పోరాదని తెలిపారు. టిఎస్పిఎస్సి ప్రక్షాళన చేసి మళ్ళీ గ్రూప్ 1 పరీక్షలు యధావిధిగా నిర్వహించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించి టిఎస్పిఎస్ ని ప్రక్షాళన చేయాలని తెలిపారు.
Read also: Empty Stomach: ఖాళీ కడుపుతో అంజీర్ తింటే ఏమవుతుంది?
అలా చేయకపోతే మంత్రులను అధికారులు ఎక్కడెక్కడ అడ్డుకొని తీరుతామన్నారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు తగిన న్యాయం చేస్తామన్నారు. గ్రూప్ 1 రద్దుతో ఆందోళన చేస్తున్న విద్యార్థులది న్యాయపోరాటమని తెలిపారు. Tspsc ప్రక్షాళన చేయాలని మేము చెప్తూ వచ్చామన్నారు. కానీ ప్రభుత్వం మొండిగా వ్యవహారం చేసిందన్నారు. గ్రూప్ వన్ లో బయోమెట్రిక్ విధానం అమలు చేయలేదన్నారు. OMr షీట్ లో గందరగోళం సృష్టించారని మండిపడ్డారు. ఎగ్జామ్ ఐపోగానే హాజరైన విద్యార్థుల వివరాలకు 17 రోజుల తర్వాత ఇచ్చిమ వివరాలకు తేడా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 258 మంది అదనంగా ఎలా వచ్చారు? 258 omr షీట్స్ అదనంగా జోడించారు? అని ప్రశ్నించారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి నిరాశ ఎదురైతుందన్నారు. Tspsc మీద నమ్మకం లేకుండా పోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. Tspsc మెంబర్లు..అధికారులపై చర్యలు తీసుకోవాలని, సీఎం కేసీఆర్ నైతిక బాధ్యత వహిస్తూ.. రాజీనామా చేయాలన్నారు.
Chocolate: రుచి మాత్రమే కాదు.. ప్రయోజనాలు కూడా ఎన్నో?