Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Political Galleries Notification Today For Rajya Sabha Seat Ngts Telangana

Elections: రాజ్యసభ స్థానానికి నేడు నోటిఫికేషన్‌.. షెడ్యూల్‌ విడుదల

Published Date :May 12, 2022 , 9:45 am
By NTV WebDesk
Elections: రాజ్యసభ స్థానానికి నేడు నోటిఫికేషన్‌.. షెడ్యూల్‌ విడుదల
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ నుంచి ఖాళీ అయిన ఒక రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు గురువారం నోటిఫికేషన్‌ వెలువడనున్నది. నోటిఫికేషన్‌ విడుదలైన వెంటనే నామినేషన్లు స్వీకరించనున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఇందుకోసం ప్రత్యేక ఏర్పాటుచేశారు. ఈ నెల 30న ఎన్నిక జరుగనున్నది. రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్రకాశ్‌ తన పదవికి రాజీనామా చేయటంతో ఈ ఖాళీ ఏర్పడింది. ఈ స్థానంలో ఎన్నికయ్యే అభ్యర్థి పదవీ కాలం 2024, ఏప్రిల్‌ 2తో ముగుస్తుంది. బండా ప్రకాశ్‌ ఇటీవల ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఉప ఎన్నిక జరుగనున్న రాజ్యసభ స్థానాన్ని అధికార టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తున్నది. శాసనసభలో వందకుపైగా ఎమ్మెల్యేలున్న టీఆర్‌ఎస్‌ ఒకటిరెండు రోజుల్లో అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నది.

నామినేషన్లను నేటి నుంచి ఈ నెల 19 వరకు స్వీకరిస్తారు. 20న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 23 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. 30న ఉదయం 9గంటల నుంచి.. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. పోలింగ్‌ ముగిసిన అనంతరం… సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది. బండా ప్రకాశ్‌ ఎమ్మెల్సీగా ఎన్నికైన నేపథ్యంలో రాజ్యసభ సభ్యత్వానికి గత ఏడాది డిసెంబరులో రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

ఇదీ షెడ్యూల్‌..

నామినేషన్ల స్వీకరణ: 12-05-2022
నామినేషన్ల దాఖలకు తుదిగడువు: 19-05-2022
నామినేషన్ల పరీశీలన: 20-05-2022
నామినేషన్ల ఉపసంహరణ: 23-05-2022
పోలింగ్‌ : 30-05-2022 (ఉదయం 9.00 నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు)
ఓట్ల లెక్కింపు: పోలింగ్‌ ముగిసిన తరువాత సాయంత్రం 5.00 గంటల నుంచి ఎన్నిక ప్రక్రియ ముగింపు : జూన్‌ 1, 2022

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Banda Prakash
  • nominations
  • Notification
  • Rajya Sabha seat
  • telangana

తాజావార్తలు

  • RK Roja: కుటుంబ సమేతంగా ఉగాది వేడుకలు ఎందుకు జరుపుకోలేదు..? గాడిదలు కాస్తున్నారా? రోజా ఫైర్‌..

  • Lexus ES 500e: లెక్సస్ ES 500e లాంచ్.. 580KM రేంజ్, 10 ఎయిర్‌బ్యాగ్స్.. భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ లగ్జరీ కొత్త ఎరా

  • Petrol Rate Hike: వాహనదారులకు బిగ్ షాక్.. పెట్రోల్ ధరలు పెంపు..

  • Telangana Budget 2026: గుడ్‌న్యూస్.. కొత్తగా 2లక్షల పెన్షన్లు..!

  • Dhurandhar 2 Telugu: ఎంత ఆలస్యమైతే అంత లాభం?

ట్రెండింగ్‌

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • Gym Tips : జిమ్ మధ్యలో మానేస్తే మీ బాడీకి ఇదే జరుగుతుంది.! ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి.!

  • Butter Curd Rice : హెల్తీ, రుచికరమైన బటర్ కర్డ్ రైస్.. ఇలా సింపుల్ గా తయారు చేసుకోండి..!

  • IPL 2026 Injury List: గాయాల దెబ్బ, స్టార్ ప్లేయర్స్ ఔట్.. ఐపీఎల్ జట్లకు భారీ షాక్!

  • Summer Super Drinks : బాదం షర్బత్ ట్రై చేశారా..? ఎండలో కూల్‌గా ఉండే సూపర్ డ్రింక్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions