Banda Prakash : తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ బండ ప్రకాశ్ కు శుభాకాంక్షలు తెలిపారు.
శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవి ఓరుగల్లుకు దక్కనుంది. తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు గురువారం నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈనెల 11న నామినేషన్లు స్వీకరించనున్నారు.
తెలంగాణ నుంచి ఖాళీ అయిన ఒక రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు గురువారం నోటిఫికేషన్ వెలువడనున్నది. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నామినేషన్లు స్వీకరించనున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఇందుకోసం ప్రత్యేక ఏర్పాటుచేశారు. ఈ నెల 30న ఎన్నిక జరుగనున్నది. రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్రకాశ్ తన పదవికి రాజీనామా చేయటంతో ఈ ఖాళీ ఏర్పడింది. ఈ స్థానంలో ఎన్నికయ్యే అభ్యర్థి పదవీ కాలం 2024, ఏప్రిల్ 2తో ముగుస్తుంది. బండా ప్రకాశ్ ఇటీవల…
రాజ్యసభ ఉపఎన్నిక నోటిఫికేషన్ మాటే లేదు..! టీఆర్ఎస్ నేత బండ ప్రకాష్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మారిన రాజకీయ పరిణామాలతో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది పార్టీ. గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో ప్రకాష్ రాజీనామా చేయడం.. ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. రాజీనామా చేసే సమయానికి బండ ప్రకాష్‌కు రాజ్యసభ సభ్యుడిగా ఇంకా రెండేళ్లకుపైగా పదవీకాలం ఉంది. 2024 ఏప్రిల్ వరకు పదవీకాలం ఉన్న ఆ రాజ్యసభ స్థానానికి ఉపఎన్నిక నోటిఫికేషన్ వస్తే..…
మంత్రి పదవిపై వాళ్లిద్దరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అనేక లెక్కలు.. కూడికలు వేసుకున్నారు కూడా. చట్టసభలకు వెళ్లినా.. కేబినెట్‌లో బెర్త్ వాళ్లకు అందని ద్రాక్షాయేనా? సమీకరణాలు ఎక్కడ తేడా కొడుతున్నాయి? కొత్త ఎమ్మెల్సీలు చాలా ఆశలే పెట్టుకున్నారా? పాత కొత్త కలిపి.. తెలంగాణ శాసనమండలికి ఇటీవల 19 మంది ఎన్నికయ్యారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో 12 మంది.. ఎమ్మెల్యేల కోటాలో ఆరుగురు.. గవర్నర్ కోటాలో ఒకరు ఈ జాబితాలో ఉన్నారు. ప్రస్తుతం మండలిలో ఛైర్మన్, డిప్యూటీ…
టీఆర్ఎస్లో చేరిన నాటి నుంచి అనూహ్యంగా పదవులు దక్కించుకుంటున్నారు బండ ప్రకాశ్. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు. మరో కొత్త పదవి వరించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇంతలోనే ఈక్వేషన్లు మారుతున్నట్టు చర్చలు ఊపందుకున్నాయి. ఎందుకలా? ఏంటా సమీకరణాలు? బండ ప్రకాశ్‌కు మరో పదవి ఇస్తారని ప్రచారం..! ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక అధికార టీఆర్ఎస్‌లో అందరినీ ఆశ్చర్య పరిచింది. ఖాళీ అయిన ఆరు స్థానాల్లో గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడియం శ్రీహరిలకు మరోదఫా…
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక వరంగల్‌లో తీన్మార్ మోగిస్తుంది. కారు పార్టీ పుల్ జోష్ మీదుంది. ముగ్గురు నేతలను ఒకేసారి ఎంపిక చేయడం మంత్రి పదవులు సైతం దక్కే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో కారు పార్టీ శ్రేణుల్లో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపికైనా ఉమ్మడి వరం గల్ జిల్లాకు చెందిన బండా ప్రకాష్, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, కడి యం శ్రీహరి పేర్లను కేసీఆర్ ప్రకటించిన విషయం తెల్సిందే.. రాజకీ య అనుభవం,…