BRS Chief KCR: విద్యుత్ కొనుగోలు వివాదంపై కేసీఆర్‌కు నోటీసులు..
- ఛత్తీస్ ఘడ్ విద్యుత్ కొనుగోలు విషయంలో కేసీఆర్ కు నోటీసులు
- ఎన్నికల దృష్ట్యా కేసీఆర్ కు జూలై 30 వరకు సమయం
- జాన్ 15 లోపు మీ వివరణ ఇవ్వాలని ఆదేశం
- ఇప్పటి వరకు 25 మందికి నోటీసులు ఇచ్చాము
- కమిషన్ ముందు విచారణకు రావాల్సిందే -జస్టిస్ నరసింహ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS Chief KCR: తెలంగాణలో విద్యుత్ కొనుగోలు అంశం పెను దుమారాన్ని రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. ఇందుకోసం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన విద్యుత్ కాంట్రాక్టుల లోటును తీర్చాలని ఆదేశించారు. దీనిపై విచారణ చేపట్టిన కమిషన్ మాజీ ముఖ్యమంత్రికి నోటీసులు ఇచ్చింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన విద్యుత్ ఒప్పందాల్లో తన పాత్రను తెలియజేయాలని ఆ నోటీసుల్లో కమిషన్ కోరింది. విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో తన పాత్రను వివరించాలని పేర్కొంది. విద్యుత్ కమిషన్ నోటీసుల ప్రకారం జూన్ 15లోగా సమాధానం ఇవ్వాలని కోరింది.అయితే సమాధానం ఇచ్చేందుకు జూలై 30 వరకు సమయం కావాలని కేసీఆర్ కోరినట్లు సమాచారం.
Read also: Nabha Natesh: అబ్భా అనిపిస్తున్న నాభ నటేష్ అందాలు..
Also Read
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్‌వేర్
- Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
- CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
అలా అయితే కేసీఆర్ ఇచ్చే వివరణను బట్టి అక్కడ నేరుగా విచారణకు అవకాశం ఉంది. ఆయన సమాధానం సంతృప్తికరంగా లేకుంటే విద్యుత్ కమిషన్ నేరుగా విచారణకు దిగుతామని సంకేతాలిస్తోంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని పేర్కొంటూ తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో న్యాయ కమిషన్‌ను నియమించింది. ఈ క్రమంలో కమిషన్ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా బీఆర్‌ఎస్ హయాంలో పనిచేసిన కొందరు అధికారులను విచారణకు పిలిచి పలు కీలక అంశాలపై ప్రశ్నించారు. నిన్న మాజీ సీఎండీ ప్రభాకర్ రావును విచారించిన జస్టిస్ నరసింహారెడ్డి ఇవాళ మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు పంపడం గమనార్హం.
Read also: Nabha Natesh: అబ్భా అనిపిస్తున్న నాభ నటేష్ అందాలు..
కాగా విద్యుత్ కమిషన్ చీఫ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి మాట్లాడుతూ.. మూడు అంశాలపై విచారణ కొనసాగుతోందన్నారు. ఛత్తీస్ ఘడ్, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్స్ పై విచారణ కొనసాగుతోందని అన్నారు. టెండర్ల ప్రక్రియ లేకుండా ఒప్పందాలు జరిగాయన్నారు. 25 మందికి నోటీసులు ఇచ్చామన్నారు. మాజీ సీఎం కేసీఆర్ మాత్రం ఇంకా సమాధానం ఇవ్వలేదు.. టైం అడిగారన్నారు. మాజీ సీఎండీ, ఇప్పుడున్న సీఎండీ తో సమావేశం జరిపామన్నారు. నిన్న మాజీ సీఎండీ ప్రభాకర్ రావు, అప్పటి ప్రిన్సిపల్ సెక్రెటరీ సురేష్ చందా తో సమావేశమయ్యామని తెలిపారు. మూడు నిర్ణయాలు అప్పటి ప్రభుత్వం మాత్రమే తీసుకుందన్నారు. జెన్కోలకు సంబంధం లేదన్నారు. ఎస్ కే. జోషి, అరవింద్ కుమార్ తో ఇవ్వాళ సమావేశం అయ్యామన్నారు.
Read also:AP CM Chandrababu: ప్రపంచంలో నెంబర్.1 దేశంగా భరత్ తయారు కావాలి..(వీడియో)
అరవింద్ కుమార్ అప్పుడే రెగ్యులేటరి కమిషన్ కు లేఖ రాసిన పట్టించుకోలేదన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం జరిగినప్పుడు కేంద్రానికి అధికారం ఇవ్వాలన్నారు. రెండు రాష్ట్రాల ఒప్పందం తో ఛత్తీస్ ఘడ్ కు అధికారం ఇచ్చారన్నారు. భారీగా నిధులు ఖర్చు చేసి పవర్ కొనుగోలు చేశారని తెలిపారు. మొత్తం ప్రక్రియలో ఎంత నష్టం అనేది తేల్చాలన్నారు. భద్రాద్రిలో సబ్ క్రిటికల్ టెక్నాలజీ పెట్టారు..అంతటా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ పెట్టారన్నారు. యాదాద్రిలో నామినేషన్ బేస్ లో ఇచ్చారని తెలిపారు. ఇంకా పూర్తి కాలేదని, ఆగస్టు వరకు ఒక లైన్ అందుబాటులోకి అంటున్నారు కానీ రైల్వే లైన్ వెయ్యలేదన్నారు. అధికారుల నుంచే కాదు ప్రముఖులు నుంచి సమాచారం తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
Nabha Natesh: అబ్భా అనిపిస్తున్న నాభ నటేష్ అందాలు..
తాజావార్తలు
-
Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..