Munugode Bypoll: ముగిసిన నామినేషన్ల స్వీకరణ గడువు.. క్యూలైన్లో భారీగా అభ్యర్థులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాజకీయాలు మొత్తం ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక చుట్టే తిరుగుతున్నాయి… అన్ని ప్రధాన పార్టీలు కేంద్రీకరించి ఎన్నికల్లో విజయం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నాయి.. మరోవైపు.. చిన్నపార్టీలు కూడా బరిలోకి దిగాయి.. ఇక, స్వతంత్రులు కూడా భారీ సంఖ్యలో పోటీకి దిగేలా కనిపిస్తోంది.. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల గడువు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది.. అయితే, ఇంకా చాలా మంది అభ్యర్థులు.. నామినేషన్ పత్రాలతో క్యూ లైన్లో వేచిఉన్నారు.. క్యూలైన్లో ఉన్న అభ్యర్థుల నామినేషన్ల వరకు స్వీకరిస్తున్నారు అధికారులు.. మొత్తంగా ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్లు.. సెంచరీ దాటేస్తాయనే చర్చ కూడా సాగుతోంది..
Read Also: Fraud: సినిమాల్లో పెట్టుబడుల పేరుతో భారీ మోసం.. మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు చెప్పి..!
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ గడువు మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది.. అయితే, 3 గంటలలోపు క్యూలైన్ లో ఉన్న వారికి నామినేషన్లు వేసేందుకు అవకాశం ఇచ్చారు.. ఇప్పటికే 70 నామినేషన్లు దాఖలు అయినట్టు అధికారులు చెబుతున్నారు.. క్యూలైన్లో మరో 20 మందికి పైగా అభ్యర్థులు నామినేషన్ పత్రాలతో సిద్ధంగా ఉన్నారు.. మొత్తంగా 90 నుంచి 100 మధ్య నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.. కాగా, చివరి రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలు చేశారు.. చివరి నిమిషంలో గద్దర్ పోటీ నుంచి తప్పుకోవడంతో.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నామినేషన్ దాఖలు చేశారు.. ఇక, రేపు నామినేషన్ల పరిశీలన ఉండగా… ఈ నెల 17వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.. నవంబర్ 3న పోలింగ్ జరగనుండగా… నవంబర్ 6వ తేదీన ఓట్ల లెక్కించి.. ఫలితాలు ప్రకటించనున్నారు.. ప్రధానంగా మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ జరగనుంది.. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉండబోతుందని స్పష్టం అవుతోంది. టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి బరిలో ఉన్నారు. ఇప్పటికే చిన్న లీడర్ల నుంచి బడా లీడర్ల వరకు అంతా మునుగోడుపైనే ఫోకస్ పెడుతున్నారు.
తాజావార్తలు
-
Israel-Shivaji statue: ఇజ్రాయెల్‌లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
-
Fact Check: హీరోయిన్‌తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Free Food Train: ఉచిత భోజనం అందించే ఏకైక రైలు… ఆ భోజనం ఎంత రుచిగా ఉంటుందంటే, ప్రయాణికులు వేళ్లు కూడా నాక్కుంటారు!
-
Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
-
Sick Leave Denial Case: ‘సిక్ లీవ్ కావాలి’ అని వేడుకున్నా కనికరించని బాస్.. చివరకు ఆఫీస్ వాష్‌రూమ్‌లో మృతి!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!