Free Food Train: ఉచిత భోజనం అందించే ఏకైక రైలు… ఆ భోజనం ఎంత రుచిగా ఉంటుందంటే, ప్రయాణికులు వేళ్లు కూడా నాక్కుంటారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Free Food Train : రైలు ప్రయాణం అంటే కేవలం ఒక చోటు నుంచి మరో చోటుకు చేరుకోవడం మాత్రమే కాదు. అది అనుభవాల సమాహారం. కిటికీ బయట మారిపోయే దృశ్యాలు, స్టేషన్ల సందడి, కొత్త ప్రయాణికులతో పరిచయాలు అన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన జ్ఞాపకాన్ని మిగులుస్తాయి. అయితే ఈ ప్రయాణంలో ఆకలి వేస్తే సాధారణంగా మనం స్టేషన్లో ఆహారం కొనుగోలు చేయడం లేదా వెంట తీసుకెళ్లిన పదార్థాలను తినడం చేస్తాం. కానీ భారతదేశంలో ఒక ప్రత్యేకమైన రైలు ఉంది. ఇందులో ప్రయాణించే వారికి ప్రేమతో, సేవాభావంతో ఉచితంగా భోజనం అందిస్తారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ సేవ దాదాపు మూడు దశాబ్దాలుగా నిరంతరంగా కొనసాగుతోంది. ఇది ఒకింత ఆశ్చర్యం కలిగించే విషయమే. మరి ఇంతలా ఆశ్చర్యపరసన్న ఆ రైలు సంగతి ఏమిటో ఓ సారి చూద్దాం.
ఆ రైలు పేరు సచ్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్. పంజాబ్‌లోని అమృత్సర్ నుంచి మహారాష్ట్రలోని నాందేడ్ వరకు సుమారు 2,000 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు ప్రయాణిస్తుంది. మార్గమధ్యంలో మొత్తం 39 రైల్వే స్టేషన్లలో ఆగే ఈ రైలు, ఆరు ముఖ్యమైన స్టేషన్లలో ప్రయాణికులకు ఉచిత లంగర్ సేవలను అందిస్తుంది. సిక్కు మత సంప్రదాయంలో భాగమైన లంగర్ వ్యవస్థ ఆధారంగా ఈ సేవ కొనసాగుతోంది. ఇక్కడ ధనికుడు, పేదవాడు, యువకుడు, వృద్ధుడు అనే తేడా ఉండదు. మతం, కులం, ప్రాంతం అనే భేదాలు కూడా ఉండవు. రైలులో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరికీ సమానంగా భోజనం అందిస్తారు.
Also Read
- RBI New FD Rules: బల్క్ డిపాజిట్ల నుంచి FD వడ్డీ వరకు.. అక్టోబర్ 1 నుంచి RBI కొత్త నిబంధనలు
- Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
- RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
- Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
ఈ లంగర్ వెనుక ఉన్న అసలు బలం సేవాభావం. గురుద్వారాలు, భక్తులు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కొందరు బియ్యం, పప్పులు, ధాన్యాలను దానం చేస్తారు. మరికొందరు వంటలో సహాయం చేస్తారు. ఇంకొందరు ప్రయాణికులకు స్వయంగా ఆహారం వడ్డిస్తారు. కర్రీ రైస్, కిచిడీ, పప్పు, శనగల వంటి పోషకాహారంతో కూడిన భోజనం అందిస్తారు. ఈ ఆహారం కేవలం ఆకలిని తీర్చడమే కాదు, మానవత్వం ఇంకా జీవించి ఉందనే భావనను కూడా కలిగిస్తుంది. ఈ సేవకు అలవాటుపడిన చాలామంది ప్రయాణికులు తమ వెంట ప్రత్యేకంగా పాత్రలు కూడా తీసుకెళ్తుంటారు. ఎందుకంటే వారికి ఈ లంగర్ ప్రసాదం అందుతుందని తెలుసు. వేగంగా మారుతున్న ఈ కాలంలో ప్రతి చిన్న సేవకూ లెక్క కడుతున్న సమయంలో, ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా వేలాది మందికి భోజనం అందించడం నిజంగా గొప్ప విషయం.
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా, మథుర, ఝాన్సీ, లలిత్పూర్ వంటి స్టేషన్లలో కూడా ఈ రైలు ఆగుతుంది. దీంతో ఉత్తర భారతదేశం నుంచి ప్రయాణించే వారు కూడా ఈ సేవను అనుభవించే అవకాశం పొందుతున్నారు. ప్రయాణంలో నీళ్లు, భోజనం కోసం అధిక ధరలు చెల్లించాల్సిన రోజుల్లో సచ్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ ఒక భిన్నమైన సందేశాన్ని ఇస్తోంది. సేవ, సోదరభావం, సమానత్వం అనే విలువలు ఇంకా సమాజంలో బలంగా ఉన్నాయని ఈ రైలు ప్రతిరోజూ నిరూపిస్తోంది. అందుకే సచ్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ కేవలం ఒక రైలు మాత్రమే కాదు, మానవత్వం పట్టాలపై పరుగెత్తుతున్న అరుదైన ఉదాహరణగా నిలిచింది.
తాజావార్తలు
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Asian Games 2026: షూటింగ్లో మరో రజత పతకం.. టేబుల్ టెన్నిస్‌లో పాకిస్థాన్‌ను 3-0తో చిత్తు చేసిన భారత్
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Hanuman Ansh: ‘హనుమాన్ అంశ్’ను 15 సార్లు చూసిన నీమ్ కరోలి బాబా కుమార్తె.. ప్రతిసారీ కన్నీళ్లే..
-
Sanath Jayasuriya: టీమిండియా భవిష్యత్తు వైభవ్.. కానీ.. బీసీసీఐకి వరల్డ్ కప్ హీరో కీలక సలహా..
ట్రెండింగ్
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!