Fact Check: హీరోయిన్‌తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
- పెళ్లి చేసుకోబోతున్న మహ్మద్ సిరాజ్
- మాహిరా శర్మతో ప్రేమలో సిరాజ్
- జూన్‌లోనే పెళ్లి ముహూర్తం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fact Check on Mohammed Siraj Wedding with Mahira Sharma: టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ గల్లీ బాయ్ మహ్మద్ సిరాజ్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రముఖ మోడల్, నటి మాహిరా శర్మతో సిరాజ్ ప్రేమలో ఉన్నాడని.. త్వరలోనే వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటవుతారని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉందనే అంశంపై తాజాగా ఓ స్పష్టత వచ్చింది.
పెళ్లి రూమర్లు ఎలా మొదలయ్యాయి:
క్రికెట్, సినీ రంగాల మధ్య అనుబంధం కొత్తది కాదు. గతంలో విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ, కేఎల్ రాహుల్-అతియా శెట్టి వంటి జంటలు పెళ్లి బంధంతో ఒక్కటయ్యాయి. ఇదే తరహాలో నటి మాహిరా శర్మతో మహ్మద్ సిరాజ్ పెళ్లి అంటూ వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా వైరల్ అయిన కొన్ని పోస్టుల్లో జూన్ చివరి వారంలో సిరాజ్-మాహిరా వివాహం చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. దీంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
Also Read
- Nasser Hussain: బెన్ స్టోక్స్.. నువ్ చేసింది తప్పే, కానీ ఆ కఠిన నిర్ణయం తీసుకోవద్దు!
- Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
- Women's T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్‌ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
- 2027 ODI World Cup: ఇక అంతా వారి చేతుల్లోనే.. 2027 వన్డే ప్రపంచకప్‌లో రో-కో ఆడతారా?
బీసీసీఐ నిర్ణయంతో పెరిగిన అనుమానాలు:
బీసీసీఐ తీసుకున్న తాజా నిర్ణయం కూడా ఈ రూమర్లు మరింత ఊతమిచ్చింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కోసం ప్రకటించిన భారత టీ20 జట్టులో మొదట సిరాజ్ పేరు ఉన్నప్పటికీ.. అనంతరం అతని స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణను ఎంపిక చేసింది. వరుసగా మ్యాచ్‌లు ఆడుతున్న కారణంగా సిరాజ్‌కు విశ్రాంతి ఇవ్వాలని వర్క్‌లోడ్ మేనేజ్మెంట్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ మెడికల్ టీమ్ స్పష్టం చేసింది. అయినప్పటికీ నెటిజన్లు మాత్రం అతను పెళ్లి ఏర్పాట్ల కోసమే జట్టుకు దూరమయ్యాడంటూ ప్రచారం ప్రారంభించారు.
ఫేక్ ట్వీట్‌తో మొదలైన గందరగోళం:
మహ్మద్ సిరాజ్ పెళ్లి అంటూ వైరల్ అవుతున్న వార్తల వెనుక అసలు కారణం.. ఒక ఫేక్ సోషల్ మీడియా అకౌంట్. ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ ముఫాదల్ వోహ్రా పేరును పోలిన ఓ నకిలీ అకౌంట్లో సిరాజ్, మాహిరా శర్మ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని రాసుంది. ఈ ట్వీట్‌ను నిజమని నమ్మిన నెటిజెన్స్.. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. అయితే దీనికి ఎలాంటి అధికారిక ఆధారాలు లేవని తేలింది.
గతంలోనే స్పందించిన మాహిరా శర్మ
సిరాజ్, మాహిరా శర్మలు డేటింగ్ చేస్తున్నారంటూ గతంలో కూడా పలు వార్తలు వచ్చాయి. ఇద్దరూ ఒకే కాఫీ షాప్‌లో కనిపించడంతో సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆ సమయంలోనే మాహిరా స్పందిస్తూ.. తాను ఎలాంటి రిలేషన్షిప్లో లేనని, తన పేరును అనవసరంగా ఎవరితోనూ ముడిపెట్టవద్దని స్పష్టం చేశారు. మరోవైపు సిరాజ్ కూడా ఈ రూమర్లపై ఎప్పుడూ స్పందించలేదు
విశ్రాంతి పెళ్లి కోసం కాదు:
మహ్మద్ సిరాజ్ ఇటీవల కాలంలో తీరికలేని క్రికెట్ ఆడుతున్నాడు. టీ20 ప్రపంచకప్, ఐపీఎల్, అంతర్జాతీయ సిరీస్‌లు ఇలా వరుస టోర్నీలతో బిజీగా గడిపాడు. ఈ నేపథ్యంలో శారీరక అలసటను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ అతడికి తాత్కాలిక విశ్రాంతి కల్పించింది. ప్రస్తుతం సిరాజ్ విశ్రాంతి తీసుకుంటున్నాడే తప్ప, పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమవుతున్నాడన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టమైంది. సిరాజ్, మాహిరా వివాహం చేసుకోబోతున్నారన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని తేలింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు, ఫేక్ ట్వీట్లను నమ్మకుండా అధికారిక సమాచారం కోసం వేచి చూడటం మంచిది.
🚨 WEDDING BELLS FOR SIRAJ & MAHIRA 🚨
Mohammed Siraj and Mahira Sharma are reportedly set to tie the knot in the last week of June.
A new chapter could soon begin for the couple ❤️✨ pic.twitter.com/2Ut6b3jJPs
— Mufahal Wobra (@mufatnal_wohraa) June 10, 2026
తాజావార్తలు
-
Mahabharat Facts: మహాభారత యుద్ధంలో పాల్గొనని ఈ నలుగురు మహా యోధులు.. వీళ్లు తలుచుకుంటే ఫలితం వేరేలా ఉండేది!
-
Israel-Shivaji statue: ఇజ్రాయెల్‌లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
-
Fact Check: హీరోయిన్‌తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Free Food Train: ఉచిత భోజనం అందించే ఏకైక రైలు… ఆ భోజనం ఎంత రుచిగా ఉంటుందంటే, ప్రయాణికులు వేళ్లు కూడా నాక్కుంటారు!
-
Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!