Fraud: వైద్య వృత్తిలో ఉన్న ఓ కిలాడీ జంట చిట్టీల పేరుతో మోసానికి పాల్పడింది. చిట్టీల పేరుతో ప్రజల్ని మోసగించిన దంపతుల సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. నిజాంపేట బండారీ లేఅవుట్‌లో ‘రేష్మ క్లినిక్’’ పేరుతో వైద్యులుగా చలామణి అవుతున్న రేష్మ, అలీ అనే భార్యాభర్తలు సుమారు 100 మందికి పైగా వ్యక్తుల నుంచి దాదాపుగా రూ. 150 మేర వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో చిట్టీల కాలం పూర్తయినప్పటికీ, డబ్బులు ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చిన బాధితులు క్లినిక్ వెళ్లి చూడగా, ఈ కిలాడీ జంట అప్పటికే అదృశ్యమయ్యారు. దీంతో మోసపోయామని గ్రహించిన పోలీసులు బాచుపల్లి పోలీసుల్ని ఆశ్రయించారు.
Read Also: Gujarat Cabinet 2025: గుజరాత్ కొత్త మంత్రులకు శాఖలు కేటాయింపు.. జడేజా సతీమణికి ఏ శాఖ కేటాయించారంటే..
ఇప్పటికే 42 మంది బాధితులు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ 42 మంది వద్ద నుంచే రేష్మ, అలీలు సుమారుగా రూ. 10 కోట్లు వసూలు చేసినట్లు విచారణలో తేలింది. చిట్టీల రూపంలో ఒక్కొక్కరి నుంచి రూ. 50 వేల నుంచి రూ. 10 లక్షల వరకు వసూలు చేసి, అధిక లాభాలు ఇస్తామంటూ ప్రజల్ని నమ్మించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం కేసు నమోదు చేసిన పోలీసులు రేష్మ-అలీ దంపతుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.