High Court Shock to Harsha Sai Father: లైంగిక ఆరోపణలు, రేప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్ష సాయి ఇప్పటికే చిక్కుల్లో ఉన్నాడు. అతను పరారీలో ఉండగా పోలీసులు గాలిస్తున్నారు. అయితే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ, మరో యూట్యూబర్ ఇమ్రాన్ ఇద్దరికీ కోర్టు షాక్ ఇచ్చింది. ఇప్పటికే హర్షసాయితోపాటు హర్ష తండ్రి, ఇమ్రాన్ పై బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన హర్ష సాయి తండ్రి రాధాకృష్ణని అసలు కేసులో నిందితులుగా చేర్చకముందే ముందస్తు బెయిల్ ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించింది హైకోర్టు.
వెంటనే ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ఇదే కేసులో నిందితులుగా చేర్చిన తర్వాత ముందస్తు బెయిల్‌కు రావాలని సూచనలు చేసింది. మరోపక్క యూట్యూబర్ హర్ష సాయి పై మరో ఫిర్యాదు నమోదు అయింది. తనపై ట్రోలింగ్ చేయిస్తున్నాడని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు హర్ష సాయి బాధితురాలు ఫిర్యాదు చేసింది. ట్రోలింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, ట్రోలింగ్ స్క్రీన్ షాట్లను పోలీసులకు ఇచ్చింది బాధితురాలు. అత్యాచార బాధితురాలైన తనపై హర్షసాయి ఉద్దేశపూర్వకంగా ట్రోలింగ్ చేయిస్తున్నాడని బాధితురాలు పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.