70 ప్లస్ లో కూడా బాడీకి రెస్ట్ ఇవ్వకుండా కష్టపడుతున్నారు స్టార్ హీరోస్ రజనీకాంత్, కమల్ హాసన్లు. సూర్య, శివకార్తీకేయన్ లైనప్ కూడా పెద్దదే. ఇక విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సినిమాలకు టాటా చెప్పబోతున్నాడు లేకుంటే డైరెక్టర్లు క్యూ కడతారు. మరీ అజిత్ సంగతేంటీ ఇటీవల విదాముయర్చితో పలకరించిన అజిత్, ఏకే 63 తర్వాత సినిమా ఎవరితో అంటూ ప్రశ్నలు మొదలయ్యాయి.
Also Read : Rashmika Mandanna : రష్మిక ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడినట్టే
ఏడాది గ్యాప్ తర్వాత రిలీజ్ అయిన విదాముయర్చి ప్లాప్ గా మిగిలింది. ప్రెజెంట్ అజిత్ చేతిలో గుడ్ బ్యాడ్ అగ్లీ మాత్రమే ఉంది. ఇది ఏప్రిల్ 10న విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఇక ఇప్పుడు 64 సినిమా ఎనౌన్స్ మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఇదిగో అజిత్ 64కు డీల్ చేసేది ఈ దర్శకుడు ఆ డైరెక్టర్ అంటూ రొజుకొక పేర్లు తెరపైకి వస్తున్నాయి. స్టైలిష్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజుతో నెక్ట్స్ ప్రాజెక్ట్ అంటూ వార్తలు వినిపించాయి. అజిత్ కు గతంలో బిల్లాతో హిట్టు ఇచ్చిన విష్ణు వర్థన్ పేరు ప్రస్తావనకు వచ్చింది. అలాగే గుడ్ బ్యాడ్ అగ్లీ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ కు మరో అవకాశం ఇవ్వబోతున్నాడని కోలీవుడ్ సమాచారం. అంతలో మరో పేరు తెరపైకి వచ్చింది. మహారాజాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నిథిలన్ సామినాథన్ అజిత్ 64 ను డీల్ చేయబోతున్నాడన్నది టాక్. నిథిలన్ చెప్పిన కథ అజిత్ కి బాగా నచ్చిందని, ఇక గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయి అన్నది బజ. వీరిలో అజిత్ ను డైరెక్ట్ చేయబోయే దర్శకుడు ఎవరోనని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.