MKC Kavitha: కేసీఆర్ను ఎదుర్కొనే ధైర్యం, దమ్ములేక నాపై, కేటీఆర్ పై అక్రమ కేసులు పెట్టారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ పర్యటనలో భాగంగా కవిత మాట్లాడుతూ.. ఎన్ని కేసులు పెట్టిన భయ పడేది లేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందన్నారు. బస్సుల సంఖ్య తగ్గించి ఫ్రీ బస్సు ఇస్తున్నారని తెలిపారు. అనేక ఇబ్బందులు, కష్టాలు ఎదురైనా పిడికిలి ఎత్తి అన్ని ఎదురించి వచ్చానని కవిత అన్నారు. నేను నిప్పులాంటి నిజామాబాద్ బిడ్డను… దేనికీ భయపడనని అన్నారు. మాది భయపడే రక్తం కాదు.. భయపెట్టే రక్తం అన్నారు. మేము తప్పు చేయలేదు… భయపడే ప్రసక్తే లేదన్నారు.
Read also: Harish Rao: బాసర సరస్వతి తల్లి మనసు తల్లడిల్లుతుంది..
ఎన్ని కేసులు పెట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలు నిప్పు కణికల్లా బయటికి వస్తారన్నారు. కేంద్రాన్ని ఎదురించి ప్రశ్నిస్తే బీజేపీ కేసులు పెడుతోందన్నారు.
రాష్ట్రంలో అక్రమ కేసులపై గురించి చెప్పనవసరం లేదని తెలిపారు. రాబోయేది గులాబీ జెండా శకమే.. అందులో సందేహమే లేదని కవిత అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చంద్ర బాబు శిష్యుడని తెలిపారు. తెలంగాణ తల్లిని మరచిపోవాలని అంటున్నారన్నారు. తెలంగాణ తల్లి మాది, కాంగ్రెస్ తల్లి మీదన్నారు. తెలంగాణ సంస్కృతి పై దాడి జరుగుతుందన్నారు. పేరు మర్పిపోయినా, రైతులు భూములు ఇవ్వకపోయినా సీఎం రేవంత్ కేసులు పెడుతున్నారని కవిత పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఎందుకింత భయం ? అని ప్రశ్నించారు. డిగ్రీ చదువుకున్న ఆడపిల్లలకు స్కూటీల పంపిణీ ఏమైంది ? మహిళలకు నెలకు రూ. 2500, కళ్యాణ లక్ష్మీ కింద తులం బంగారం ఇవ్వలేదుని గుర్తు చేశారు.
Read also: జనవరి నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు ఇవే..
మైనారిటీలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కాంగ్రెస్ సర్కార్ అమలు చేయలేదని మండిపడ్డారు. బీరాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం …. ఇప్పటి వరకు పెన్షన్లు మొత్తాన్ని పెంచలేదన్నారు. మనం ఊరుకుంటే ప్రభుత్వం కదలదు… ప్రతీ ఒక్కరు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు. గ్రామ గ్రామాన కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని పిలుపు నిచ్చారు. పీపుల్స్ ఫ్రెండ్లీ పోలిసింగ్ పోయి… రాష్ట్రంలో కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ నడుస్తోందన్నారు. రాష్ట్రంలో పోలీసు జులుం నడుస్తుందన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన మంచి పనులను ప్రభుత్వం కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాబోయేది గులాబీ జెండా శకమే… అందులో సందేహమే లేదన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానే అన్నారు.
Read also: Yadagirigutta: గ్రిల్స్ మధ్యలో ఇరుక్కున్న బాలుడి తల.. తరువాత ఏం జరిగిందంటే..
గురుకులాలను పడడానికి కూడా ప్రభుత్వానికి చేతకావడం లేదన్నారు. ఇప్పటికే 57 మంది పిల్లలను పొట్టనపెట్టుకున్నారు.. ఇంకెంత మందిని పొట్టనపెట్టుకుంటారు ? అని మండిపడ్డారు కవిత. ఉద్యోగాల పేరిట సీఎం రేవంత్ రెడ్డి యువతను తప్పదోవ పట్టిస్తున్నారన్నారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటి వరకు కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకే ఉద్యోగాలు ఇస్తున్నారన్నారు. మన పొట్టమీదనే కాదు… మన సంస్కృతిపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దాడి చేస్తుందన్నారు. మళ్లొకసారి నిజామాబాద్ పవర్ ను సీఎం రేవంత్ రెడ్డికి రుచి చూపిద్దామన్నారు.
మైగ్రేన్ తలనొప్పితో బాధ పడుతున్నారా? ఇలా ట్రై చేయండి