Nizamabad: నిజామాబాద్‌లోని మార్కెట్ యార్డుకు పోటెత్తిన పసుపు..
- నిజామాబాద్ మార్కెట్ యార్డుకు పోటెత్తిన పసుపు
- 50 వేల బస్తాలకు పైగా అమ్మకానికి వచ్చిన పసుపు
- కనీస మద్దతు ధర క్వింటాకు 500 ధర తగ్గింపు
- కటాఫ్ ధరకు కొనుగోలు చేయలేమని నిన్న కొనుగోళ్ల నిలిపివేత.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజామాబాద్‌లోని మార్కెట్ యార్డుకు పసుపు పోటెత్తింది. 50 వేల బస్తాలకు పైగా అమ్మకానికి పసుపు రావడంతో రైతులతో మార్కెట్ యార్డ్ మొత్తం సందడిగా మారింది. కనీస మద్దతు ధరతో కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మార్కెట్ యార్డ్ ముట్టడించి అక్కడి నుంచి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ తీశారు. బస్టాండ్ ఎదుట రెండు గంటల పాటు ధర్నా చేపట్టారు. దీంతో.. నిన్న పసుపు కొనుగోళ్లు నిలిచిపోయాయి. జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో వ్యాపారులు రైతులతో జరిపిన చర్చల ముగిశాయి. కటాఫ్‌కు 500 ధర తగ్గిస్తే పసుపు యథావిధిగా కొనుగోలు చేస్తామంటూ వ్యాపారులు తేల్చిచెప్పడంతో చేసేదేమీ లేక రైతులు ఒప్పుకున్నారు.
Read Also: Vikram : విక్రమ్ సినిమా తెలుగు స్టేట్స్ మంచి ధర పలికింది
Also Read
దీంతో.. క్వింటాకు 500 ధర తగ్గిస్తూ, క్వింటాల్ పసుపు 9500 రూపాయలకు కొనుగోలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే మార్కెట్ యార్డుకు పసుపు రైతులు పోటెత్తారు. పసుపు కొనుగోళ్లపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సీజన్ ప్రారంభం నుంచి క్వింటాల్‌కు 2 వేలకు పైగా ధర పతనం అయ్యిందని పసుపు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం క్వింటాల్‌కు రూ.18000 వరకు ధర పలుకగా.. ఈసారి రూ. 10వేల లోపు కనీస ధర పలుకుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నాణ్యత వంకతో ధరలు తగ్గుతున్నాయని మార్కెట్ చైర్మన్ చెబుతుండటంపై రైతులు తప్పు పడుతున్నారు. వ్యాపారులు, మార్కెట్ కమిటీ అధికారులు కుమ్మక్కయ్యారని రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు.
Read Also: Gold Rate Today: తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్‌కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!