Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం
- నలుగురు తెలంగాణ వాసుల మృతి
- మృతులు నిర్మల్ జిల్లా కుబీర్ వాసులుగా గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెలంగాణలోని నిర్మల్ జిల్లాకు చెందిన నలుగురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. పుణ్యక్షేత్రాలను సందర్శించి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. మృతులు నిర్మల్ జిల్లా కుబీర్ వాసులుగా గుర్తించారు.
ప్రమాదానికి సంబంధించిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లాకు చెందిన కొందరు జీపులో పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లారు. యాత్ర ముగించుకుని తిరిగి వస్తుండగా మహారాష్ట్రలో జీపు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, సహాయక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను బయటకు తీశారు. అనంతరం వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Also Read
ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ప్రమాదానికి గల కారణాలు, మృతులు, క్షతగాత్రుల పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!