Khanapur : ఖానాపూర్ మున్సిపల్ ఎన్నిక వాయిదా
- ఉద్రిక్తతల మధ్య ఖానాపూర్ ఎన్నిక వాయిదా
- కౌన్సిలర్ల ఘర్షణతో హాల్‌లో గందరగోళం
- అధికారులపై బీజేపీ, కాంగ్రెస్ ఆరోపణలు
- మెజారిటీ లేని సమీకరణాలతో రాజకీయ ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతల నడుమ రేపటికి వాయిదా పడింది. మున్సిపల్ హాల్ లోపల కౌన్సిలర్ల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలు, బయట రాజకీయ పార్టీల శ్రేణుల వాగ్వాదాల నేపథ్యంలో శాంతిభద్రతల దృష్ట్యా ఎన్నికల అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. చైర్మన్ ఎంపిక కోసం సభ్యులు చేతులు ఎత్తే క్రమంలో ఒక పార్టీ అభ్యర్థికి మద్దతుగా సభ్యులు వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు , ఇతర సభ్యులు అధికారులతో వాగ్వాదానికి దిగడంతో హాల్ లోపల గందరగోళం నెలకొంది.
Rashmika: హిస్టరీ క్రియేట్ చేసిన రష్మిక మందన్న.. వరుసగా రెండోసారి జపాన్ నుంచి పిలుపు!
Also Read
మరోవైపు, ఎన్నికల నిర్వహణలో అధికారులు కావాలనే జాప్యం చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మున్సిపల్ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 12 వార్డులున్న ఖానాపూర్ మున్సిపాలిటీలో ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. బీఆర్ఎస్ , బీజేపీలకు చెరో నాలుగు స్థానాలు ఉండగా, కాంగ్రెస్ మూడు స్థానాల్లో విజయం సాధించింది. ఒక స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. అయితే ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు ఓటుతో పాటు, ఇండిపెండెంట్ అభ్యర్థి మద్దతు ఉండటంతో కాంగ్రెస్ బలం ఐదుకు చేరుకుంది. ఈ క్లిష్టమైన సమీకరణాల మధ్య చెలరేగిన గొడవల కారణంగా ప్రస్తుతం ఎన్నిక ప్రక్రియ నిలిచిపోయింది.
Iran-Israel: ఇరాన్, లెబనాన్‌పై ఏకకాలంలో ఇజ్రాయెల్ దాడులు.. మంటల్లో పలు భవనాలు
తాజావార్తలు
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
-
Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
-
Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?