Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీ అకాడమిక్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 26 నుంచి ఆన్లైన్ క్లాసులు
- అక్టోబర్ 26 నుంచి ఆన్లైన్ తరగతులు
- నవంబర్‌లో క్యాంపస్‌కు విద్యార్థుల రాక
- ఆఫ్‌లైన్‌లోనే మిడ్‌టర్మ్, సెమిస్టర్ పరీక్షలు
- పాత బ్యాచ్‌లకు రిమిడియల్ పరీక్షల షెడ్యూల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాసర ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో పియుసి-1 (PUC-I) నుంచి ఇంజినీరింగ్ నాల్గవ సంవత్సరం (E4) వరకు చదువుతున్న విద్యార్థులందరికీ సవరించిన అకాడమిక్ షెడ్యూల్‌ను విశ్వవిద్యాలయ యాజమాన్యం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన అసాధారణ పరిస్థితులు, దసరా సెలవుల పొడిగింపు నేపథ్యంలో విద్యార్థుల సంక్షేమం , విద్యా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని 2026-27 విద్యాసంవత్సరం సెమిస్టర్-1కు సంబంధించి ఈ బ్లెండెడ్/హైబ్రిడ్ మోడ్ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. నూతన వర్కింగ్ ప్లాన్ ప్రకారం అక్టోబర్ 26, 2026 నుండి విద్యార్థులందరికీ ఆన్లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఆన్లైన్ మోడ్ ద్వారా నవంబర్ 17, 2026 నాటికి నిర్దేశిత సిలబస్‌ను పూర్తి చేయాలని యూనివర్సిటీ నిర్ణయించింది.
క్యాంపస్‌కు తిరిగొచ్చే తేదీలు.. ప్రత్యేక మార్గదర్శకాలు
విశ్వవిద్యాలయ ప్రాంగణానికి విద్యార్థులు తిరిగి వచ్చే తేదీలకు సంబంధించి యాజమాన్యం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. పియుసి-1, పియుసి-2 విద్యార్థులు నవంబర్ 10, 2026న బాసర క్యాంపస్‌కు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. వీరికి నవంబర్ 10 నుండి నవంబర్ 18 వరకు క్యాంపస్‌లోనే నేరుగా తరగతులు నిర్వహిస్తారు. మరోవైపు, ఇంజినీరింగ్ (E1 నుండి E4) విద్యార్థులందరూ నవంబర్ 18, 2026న క్యాంపస్‌లో రిపోర్ట్ చేయాలని అధికారులు తెలిపారు. విద్యార్థులందరూ యాజమాన్యం కేటాయించిన తేదీలకు అనుగుణంగానే క్యాంపస్‌కు చేరుకోవాలని సూచించారు.
Also Read
- OTR: ముగ్గురు మంత్రులు.. ముగ్గురు వారసులు! నెక్స్ట్ ప్లాన్ ఏంటి?
- Bhatti Vikramarka : తెలంగాణకు సూపర్ ఎల్ నినో ముప్పు.. డిప్యూటీ సీఎం భట్టి కీలక విజ్ఞప్తి
- Pashamylaram Drug Raid: తెలంగాణలో భారీగా డ్రగ్స్ ముడిసరుకు ఫ్యాక్టరీ గుట్టురట్టు..
- Uttam Kumar Reddy : కాళేశ్వరం పునరుద్ధరణకు ఆర్మీ ఇంజనీర్.. బీఆర్ఎస్ తీరుపై మంత్రి ఉత్తమ్ ఫైర్
ఆఫ్‌లైన్ మోడ్‌లోనే మిడ్-టర్మ్, సెమిస్టర్ పరీక్షలు
విద్యార్థులకు నిర్వహించే మిడ్-టర్మ్, ఎండ్ సెమిస్టర్ థియరీ , ప్రాక్టికల్ పరీక్షలన్నీ ఆఫ్‌లైన్ (ఫిజికల్) పద్ధతిలోనే జరుగుతాయని వర్సిటీ స్పష్టం చేసింది. పియుసి నుంచి ఇంజినీరింగ్ వరకు అన్ని బ్యాచ్‌ల విద్యార్థులకు మిడ్-టర్మ్ (MT-2 & MT-3) ఆబ్జెక్టివ్ పరీక్షలను నవంబర్ 19 నుండి నవంబర్ 21 వరకు మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. ఎండ్ సెమిస్టర్ పరీక్షల వివరాల్లోకి వెళితే.. E1, E2 బ్యాచ్‌లకు ల్యాబ్ ప్రాక్టికల్ పరీక్షలు నవంబర్ 23 నుండి 28 వరకు, థియరీ పరీక్షలు నవంబర్ 29 నుండి డిసెంబర్ 06 వరకు ఉంటాయి. E3, E4 బ్యాచ్‌లకు థియరీ పరీక్షలు నవంబర్ 23 నుండి 29 వరకు, ప్రాక్టికల్స్ నవంబర్ 30 నుండి డిసెంబర్ 03 వరకు నిర్వహించనున్నారు. పియుసి (P1, P2) విద్యార్థులకు థియరీ పరీక్షలు నవంబర్ 23 నుండి డిసెంబర్ 06 వరకు కొనసాగుతాయి.
రిమిడియల్ పరీక్షల షెడ్యూల్.. విద్యార్థులకు యాజమాన్యం సూచనలు
ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న రిమిడియల్ పరీక్షలకు సంబంధించిన తేదీలను కూడా విశ్వవిద్యాలయం ప్రకటించింది. B22, B23, B24 పియుసి బ్యాచ్‌లకు రిమిడియల్ పరీక్షలు అక్టోబర్ 27 నుండి నవంబర్ 11 వరకు జరగనుండగా, ఇంజినీరింగ్ సెమిస్టర్-2 రిమిడియల్స్ నవంబర్ 10 నుండి 18 వరకు నిర్వహిస్తారు. ఇక మిగిలిన పెండింగ్ , P1, P2 రిమిడియల్ పరీక్షలన్నీ డిసెంబర్ 07, 2026 నుండి ప్రారంభమవుతాయి. అసాధారణ పరిస్థితుల దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయాలకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సహకరించాలని, ఆన్లైన్ క్లాస్‌రూమ్‌లోని డిజిటల్ అప్డేట్లను క్రమం తప్పకుండా గమనిస్తూ షెడ్యూల్ ప్రకారం తరగతులకు, పరీక్షలకు హాజరుకావాలని వర్సిటీ యాజమాన్యం కోరింది.
తాజావార్తలు
-
Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీ అకాడమిక్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 26 నుంచి ఆన్లైన్ క్లాసులు
-
Mythri Ravi : ‘ఫౌజీ’, ‘డ్రాగన్’ రిలీజ్‌లపై వెనక్కి తగ్గేదే లేదు.. నాగార్జున కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకుకున్నాం
-
OTR: ముగ్గురు మంత్రులు.. ముగ్గురు వారసులు! నెక్స్ట్ ప్లాన్ ఏంటి?
-
PV Sindhu : ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో పి.వి.సింధు.. మరో సూపర్ 750 టైటిల్‌పై కన్ను
-
Shah Rukh Khan: ‘కింగ్’ ఎంట్రీ సీన్‌పై మైండ్ బ్లోయింగ్ లీక్!
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!