ఎవరైనా వారి పిల్లలను కేంద్రీయ విద్యాలయాల్లో చేర్పించాలని అనుకొనే తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్.. కేవలం నామ మాత్రపు ఫీజ్ లతో చిన్నారుల్లో సమగ్ర వికాసాన్ని పెంపొందించే ఈ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ నేటి నుండి మొదలైంది. కాబట్టి ఎవరైనా ఆసక్తి కలిగిన వారు నేటి నుంచి ఏప్రిల్ 15వ తేదీ సాయంత్రం 5గంటల వరకు వారి పిల్లల వివరాలను ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ స్కూల్స్ లో సీటు దొరికితే ప్లస్ టూ వరకు పిల్లల చదువులు నిశ్చింతగా ఉంటాయి. అయితే ఇందుకోసం, ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? మరీ ఏయే డాక్యుమెంట్లు అవసరం..? వంటి విషయాలను పరిశీలిస్తే..
Also read: Fire Accident: రంగారెడ్డి జిల్లా కాటేదాన్‌లో అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు
ఆన్‌లైన్ దరఖాస్తుల కోసం మొదట కేవీఎస్ ఆన్‌లైన్ పోర్టల్‌ను సందర్శించి తొలుత రిజిస్టర్ అవ్వాలి. అక్కడ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీతో పాటు లాగిన్ కు అవసరమైన వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఒకటో తరగతి అడ్మిషన్ అప్లికేషన్ ను యాక్సిస్ చేసుకోవాలి. దరఖాస్తులో అడిగిన లాగా తల్లితండ్రులు వారి పిల్లల వివరాలు, తల్లిదండ్రుల సమాచారం, ఏ స్కూల్ లో చేర్చాలనుకొంటున్నారో అన్ని పేర్కొనాలి. పిల్లలు, తల్లిదండ్రుల వివరాలు నింపడంతో పాటు, ఏ స్కూల్ లో చేర్పించాలనుకొంటున్నారన్న ప్రాధాన్యతల వారీగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా స్కాన్ చేసిన డాక్యుమెంట్స్, ఫొటో గ్రాఫ్ లను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆపై ఒకసారి సరిచూసుకొని సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత సబ్మిషన్ విజయవంతమైతే అప్లికేషన్ కోడ్ వస్తుంది.
Also read: Tillu squre: 100 కోట్ల లక్ష్యంతో దూసుకుపోతున్న టిల్లు.. 3 రోజులకు ఏకంగా..?!
ఇక ఇందుకు గాను ఎలాంటి డాక్యుమెంట్లు అవసరమంటే.. ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, పిల్లల బర్త్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ వర్గానికి చెందినవారైతే ప్రభుత్వ నుంచి సంబంధిత ధ్రువీకరణపత్రం అవసరం. ఇంకా పిల్లల ఆధార్ కార్డు, ఫొటో.. అలాగే తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ కు సంబంధిచిన పత్రాలు.. రెసిడెంట్ సర్టిఫికెట్, గార్డియన్‌తో పిల్లవాడికి ఉన్న రిలేషన్ షిప్ కు సంబంధించిన ఆధారాలను ఇవ్వాల్సి ఉంటుంది.