తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన మైన సమస్య వడ్లు కొనుగోళ్లని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. పంట పండించడం కంటే వాటిని అమ్మడం పెద్ద సమస్యగా మారిందని పేర్కొన్నారు. రైతులు తాము వడ్లు అమ్ముకోగలం అన్న నమ్మకం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరి వేసిన రైతులు ఈ 6 నెలలు బిక్కు బిక్కుమంటూ బతికారని అన్నారు. రైతుల పక్షాన పోరాటం చేయడానికి నెల రోజులుగా ”రైతుగోస” పేరుతో సమస్యలను ప్రస్తావించినా సీఎం స్పందిచలేదని అన్నారు.
సూర్యాపేట మార్కెట్ యార్డ్ లో 5 రోజుల నుంచి పండించిన పంటను కుప్పలు వేసుకొని రైతులు అక్కడే ఉన్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది రైతులకు మద్దతు ధర రావటం లేదని కన్నీరు పెట్టుకుంటున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ లోకి తెచ్చిన పంటని వెనక్కి తీసుకువెళ్లలేక రైతులు అగచాట్లు వర్ణణాతీతమని అన్నారు. కేవలం 1500 రూపాయలకు పంటను అమ్ముకునే దుస్థితి రైతులకు ఏర్పడిందన్నారు.
మద్దతు ధర 1960 రూపాయలు అయితే.. ఒకరో, ఇద్దరికో ఆధర వేసి తూతూ మంత్రంగా కానిస్తున్నారని మండిపడ్డారు. 70 శాతం మందికి మద్దతు ధర రావటం లేదని షర్మిల అన్నారు. మెదక్ మార్కెట్ యార్డ్ పరిస్థితి కూడా చాలా దారుణంగా వుందని, అక్కడి రైతులు 20 రోజులుగా కుప్పలు వేసుకుని, ఇంటికి దూరంగా వున్నారని ఆమె అన్నారు. సీఎం కెసిఆర్ జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే.. మిగతా జిల్లాల పరిస్థితి ఏంటని షర్మిల మండిపడ్డారు. నీ మాట నమ్మి వరి వేసుకోకుండా ఉన్నందుకు వారికి సీఎం పార్టీ అకౌంట్ లో ఉన్న 850 కోట్లు నుంచి నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మద్దతు ధర కాదు.. రైతులకు బోనస్ ఇవ్వాలన్నారు. 24గంటల కరెంట్ ఇస్తామన్నారు.. కానీ 7 గంటలు మాత్రమే ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మేల్కొని.. కేసీఆర్ ఫామ్ హౌస్ లో నుంచి బయటకు రావలని షర్మిల అన్నారు.
Nagaraju Murder: నాగరాజు హత్యలో టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ నేతలు
