గత రెండు రోజల నుంచి తెలంగాణలో సంచలన సృష్టిస్తోన్న సీఐ నాగేశ్వర్ రావు కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇటీవల ఓ వివాహితను బెదిరించి అత్యాచారానికి ఒడిగట్టారని ఆరోపణలు సీఐ నాగేశ్వర్‌రావుపై రావడంతో.. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నారు పోలీసుల. ఈ నేపథ్యంలోనే ఎస్‌వోటీ పోలీసుల సీఐ నాగేశ్వర్‌రావును అరెస్ట్ చేసేందుకు వెళ్లగా వాళ్లను బురడీ కొట్టించినట్లు తెలుస్తోంది. డ్యూటీలో ఉన్న సీఐ నాగేశ్వర్‌రావును అదుపులోకి తీసుకునేందుకు ఎస్‌వోటీ టీం వచ్చింది. అయితే.. తన రాత్రి డ్యూటీలో ఉన్నానని, ఉదయం వచ్చి లొంగిపోతానంటూ చెప్పి నమ్మించాడు సీఐ నాగేశ్వర్‌రావు. అయితే.. సరే అని .. రాత్రి 12.15 గంటలకు నార్త్‌జోన్ అధికారులు ఫోన్ చేయగా సీఐ నాగేశ్వర్ రావు ఫోన్ స్విచ్ రావడంతో పాటు తను పరారైనట్లు తెలుస్తోంది.
Breaking News : రక్షకులే భక్షకులవుతున్నారా.. సీసీఎస్ ఎస్సైపై రేప్ కేసు..
అయితే.. రెండు రోజులుగా నాగేశ్వర్‌రావు తప్పించుకుని తిరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. నాగేశ్వరరావుని పట్టుకునేందుకు ఇప్పటికే రంగంలో నాలుగు ప్రత్యేక బృందాలు దిగాయి. అయితే ఇదిలా ఉంటే.. కొద్దిసేపట్లో ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయాన్ని కాంగ్రెస్ ముట్టడించనుంది. వివాహిత ను బెదిరించి అత్యాచారం చేసిన సీఐ నాగేశ్వర్ రావును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఎల్బీ నగర్ ఏసీపీ కార్యాలయాన్ని కాంగ్రెస్ నాయకులు ముట్టడించనున్నారు. ఈ కార్యక్రమంలో మహిళ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొననున్నారు. అయితే.. ఎల్బీనగర్ నాయకులు మల్రెడ్డి రాంరెడ్డి ఆధ్వర్యంలో ముట్టడి చేయనున్నట్లు సమాచారం.