మహారాష్ట్ర ప్రభుత్వం బలవంతపు మత మార్పిడులు, లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా చట్టాన్ని రూపొందించేందుకు యత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ కొత్త చట్టంలోని అంశాలను అధ్యయనం చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర డీజీపీ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో స్త్రీ శిశు సంక్షేమం, మైనారిటీ వ్యవహారాలు, చట్టం, న్యాయవ్యవస్థ, సామాజిక న్యాయం, ప్రత్యేక సహాయం శాఖల కార్యదర్శులు, హోం శాఖ డిప్యూటీ కార్యదర్శి ఉన్నారు.
ఈసీ, సీఈసీ నియామకాలకు సంబంధించి కొత్త చట్టంపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన చట్టంపై స్టే విధించలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
చిన్నారులు, యువతులు అనే తేడా లేకుండా.. చదువుకునే ప్రాంతంలోనూ లైంగిక వేధింపులకు గురవుతున్నారు.. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే పాడుబుద్ధి చూపిస్తున్నారు.. బోధనేతర సిబ్బంది కూడా చిన్నారులపై లాంగిక దాడులకు పాల్పడిన ఘటనలు ఎన్నో.. అయితే, వీటిపై దృష్టిసారించిన తెలంగాణ ప్రభుత్వం.. ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.. ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీబీ ఆనంద్ వెల్లడించారు.. చిన్నారులు, యువతుల రక్షణపై హైదరాబాద్ సీపీ కీలక వ్యాఖ్యలు.. స్కూళ్లు, కాలేజీల్లో అమ్మాయిల మీద అఘాయిత్యాలపై ప్రత్యేక చట్టం…
దేశంలో జనాభా నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త చట్టం తేనుందని కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్‌లో పాల్గొన్న ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. దేశంలో రోజు రోజుకు జనాభా పెరిగిపోతుండటంతో అనేక సమస్యలు వస్తున్నాయి. జనాభా పెరుగుదలతో సంక్షోభం కూడా తలెత్తే అవకాశం ఉంది. దీంతో జనాభా నియంత్రణపై ఎలా చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్‌ను మీడియా ప్రశ్నించింది.…
ప్రపంచ వ్యాప్తంగా చిన్నారులపై హోం వర్క్ భారం పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో పిల్లలపై హోంవర్క్ భారం తగ్గించేందుకు చైనా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీని కోసం కొత్త చట్టం తీసుకురావాలని యోచిస్తోంది. ఈ చట్టం ద్వారా తీసుకురాబోయే నిబంధనలను అమలు చేసే బాధ్యతను స్థానిక అధికార యంత్రాంగానికి అప్పగించాలని చైనా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పిల్లలకు హోంవర్క్ తగ్గించడమే కాకుండా పిల్లలకు సరిపడా విశ్రాంతి లభించేలా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అని ఈ చట్టం ద్వారా…
చైనాలో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఎంత కఠినంగా ఉంటాయో వాటిని అంతే కఠినంగా అమలు చేయటం డ్రాగన్ స్పెషాల్టీ. అలాంటివి ఇప్పటికే అక్కడ చాలా ఉన్నాయి. ఇప్పుడు వాటికి మరొకటి జతవుతోంది. చైనాలో వ్యక్తి స్వేచ్చ తక్కువ. కమ్యూనిస్టు పార్టీ అధినాయకుడే దేశాధినేత. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే దాదాపు అదే ఫైనల్. ఎదిగే పిల్లలకు సంబంధించి ఓ సంస్కరణల చట్టం కోసం ముసాయిదా రెడీ చేసింది. ఇంతకూ అదేమిటంటే “ఫ్యామిలీ ఎడ్యుకేషన్ ప్రమోషన్ లా”.…