బండి సంజయ్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదు?” అంటూ జేపీ నడ్డాని ట్యాగ్ చేస్తూ ట్విటర్ మాధ్యమంగా కేటీఆర్ ప్రశ్నించిన విషయంతెలిసిందే.. ఈ సెలెక్టివ్ ట్రీట్మెంట్ ఎందుకు? దీనిపై క్లారిఫికేషన్ ఇవ్వండి” అని ఆయన ట్విటర్ వేదికగా నిలదీశారు. అయితే ఈ ట్విట్ పై #TRSScared Of BandiSanjay హాష్ ట్యాగ్ పేరుతో కొందరు ట్విటర్ వేదికగా కేటీఆర్ పై విమర్శలు కురుపిస్తున్నారు.
సంజయ్ ఆధ్వర్యంలో తెలంగాణ బీజేపీ ఉద్యమించే వరకు జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ పై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు. బండి సంజయ్ పేరు వింటేనే తండ్రీ కొడుకుల గుండెల్లో దడ మొదలైందని కొందరు ట్వీట్ చేస్తే బండి సంజయ్ లేకుంటే తండ్రీ కొడుకులు ఫాంహౌజ్ లో హాయిగా నిద్రపోదామనుకుంటున్నారని ఇంకొందరు సెటైర్లు వేస్తూ ట్వీట్ చేస్తున్నారు.
కేంద్ర నిధులపై కేటీఆర్ విసిరిన సవాల్ పై చర్చకు సిద్దమని బండి సంజయ్ చెప్పడంతో భయపడి సస్పెండ్ చేయాలని అడుగుతున్నావా కేటీఆర్.. అంటూ కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. మా ధర్మాన్ని కాపాడేవాడు మాకు దేవుడితో సమానం.. ఆ దేవుడు బండి సంజయన్న అంటూ ఇంకొందరు.. బండి సంజయ్ కు మద్దతుగా భారీ ఎత్తున ట్వీట్లు చేస్తున్నారు. మొత్తం కేటీఆర్ పై నెటిజన్లు, బీజేపీ మద్దతుదార్లు చేస్తున్న ట్వీట్లు ట్రోల్ అవుతుండటం గమనార్హం.
నిన్న తెలంగాణ మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. “బీజేపీ నిజంగానే అన్ని మతాలను గౌరవిస్తే.. అన్ని మసీదులను తవ్వి, ఉర్దూపై నిషేధం విధించాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదు?” అంటూ జేపీ నడ్డాని ట్యాగ్ చేస్తూ ట్విటర్ మాధ్యమంగా కేటీఆర్ ప్రశ్నించారు. “ఈ సెలెక్టివ్ ట్రీట్మెంట్ ఎందుకు? దీనిపై క్లారిఫికేషన్ ఇవ్వండి” అని ఆయన నిలదీశారు. కాగా.. హిందూ ఏక్తా కార్యక్రమంలో బండి సంజయ్ తెలంగాణలో ఉన్న మసీదులను తవ్వాలని అసదుద్దీన్ ఒవైసీకి సవాల్ విసిరారు. శవాలొస్తే మీకు, శివలింగాలొస్తే మాకు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో తెలంగాణ తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే..
If #TRS is genuinely a Secular party, then why don't you break your ties with @asadowaisi who openly threatened HINDUS with dire consequences?
Your wisdom reflects your futile bid to pacify the wrath of the public in the upcoming elections!#TRSScaredOfBandiSanjay https://t.co/74MwCCLyJ8
— N Ramchander Rao (@N_RamchanderRao) June 5, 2022
AP SSC Results 2022 : విద్యార్థులు సిద్ధకండి.. నేడే ఫలితాలు విడుదల