Flyover Collapsed: హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎల్బీ నగర్, సాగర్ రింగ్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కూలడంతో పది మందికి గాయాలయ్యాయి. ఒకసారి మిక్సర్‌ను తయారు చేస్తున్న లారీని తీసుకెళ్తుండగా రివర్స్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. బైరామల్ గూడ ఫ్లైఓవర్ ర్యాంప్ కుప్పకూలింది. రెండు స్తంభాల మధ్య ఉన్న ర్యాంపు కూలిపోయింది. రాత్రి నాలుగున్నర ప్రాంతంలో ప్రమాదం జరిగింది.ఫ్లైఓవర్ స్లాబ్ కూలిన ఘటనలో గాయపడిన వారి వివరాలు యుపి కి చెందిన రోహిత్ కుమార్(25), పునీత్ కుమార్ (25), శంకర్ లాల్(25), రవికుమార్(26), బీహార్ కు చెందిన జితేందర్ కుమార్(26), హరేరామ్(22), విక్కి కుమార్(23), రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇంజనీర్ గోపాల కృష్ణ(29),ఇందులో యుపి కి చెందిన రోహిత్ కుమార్ పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.
బైరామాల్ గూడ ఫ్లై ఓవర్ ప్రమాదం వద్దకు ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయక చర్యలు చేపట్టింది. ప్రమాదంపై పోలీసుల నుంచి వివరాలను ఎన్డీఆర్ఎఫ్ బృందం అడిగి తెలుసుకుంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంలో తొమ్మిది మంది గాయపడ్డారని వెల్లడించింది. మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించారు. కూలిపోయిన స్లాబును సిబ్బంది తొలగిస్తున్నారు. ముందు జాగ్రత్తగా ఎన్‌డీఆర్‌ఎఫ్ టీం ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. ఫ్లై ఓవర్ కూలిన ప్రాంతానికి జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ చేరుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మలుపు ఉండడంతో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుందని వెల్లడించారు. ఇంజనీర్ల విభాగం సంబంధించిన అధికారులను సంఘటన స్థలానికి పిలుస్తున్నామని అన్నారు. వాళ్లు వచ్చిన తర్వాత కారణాలు తెలిసే అవకాశం ఉందని తెలిపారు. మలుపు ఉండడం ద్వారా ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నామని అన్నారు.
Read also: Guntur Kaaram: ‘గుంటూరు కారం’ నమ్మేదేలే… రంగంలోకి మరో బ్యూటీ?
బైరామాల్ గూడ ఫ్లై ఓవర్ ప్రమాద సమయంలో ఎనిమిది మంది ఉన్నారని ఏసీపీ శ్రీధర్ రెడ్డి అన్నారు. అందులో వర్క్ ఇంజనీర్ కూడా ఉన్నారని తెలిపారు. తెల్లవారుజామున నాలుగున్నర ప్రాంతంలో ప్రమాదం జరిగిందని, ఫ్లై ఓవర్ నిర్మాణంలోని ఓ స్ట్రెచ్ మాత్రమే కూలిపోయిందని అన్నారు. తెల్లవారు జామున స్లాబ్ నిర్మాణం చేస్తుండగా సపోర్టింగ్ రాడ్స్ కూలిపోయాయని అన్నారు. స్లాబ్ కింద రాడ్స్ ఏర్పాటులో సమస్య తలెత్తి ఉండొచ్చని పేర్కొన్నారు. ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి అయితే నాణ్యత ప్రమాణాలు పాటించ లేదని చెప్పవచ్చని అన్నారు. ప్రస్తుతం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కాబట్టి నాణ్యత ప్రమాణాల సమస్య కాదని తెలిపారు. సాగర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్ ఘటనపై కేసు నమోదు చేశామన్నారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, మిగిలిన ఇద్దరికీ గాయాలయ్యాయని అన్నారు. యూపీ కి చెందిన రోహిత్ పరిస్థితి విషమంగా ఉందని, అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని స్పష్టం చేశారు. స్లాబు వేసే సమయంలో కింద రాడ్లు సరిగ్గా పొందకపోవడం లేక కాంక్రీట్ లారీ తాకడం ద్వారా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ వద్ద భారీగా పోలీసుల మోహరించారు.
కూలినప్పుడు మాకు సంబంధించిన వాళ్ళు ఆరుగురు స్లాబ్ మీద ఉన్నారని బీహారీ వ్యక్తి తెలిపారు. నాలుగున్నర ప్రాంతంలో ఒక్కసారిగా స్లాబు కుప్పకూలిందని వెల్లడించారు. వారు వెళ్లి చూసేసరికి యూపీకి చెందిన రోహిత్ తల పగిలి సీరియస్ గా ఉన్నాడని తెలిపారు. మిగిలిన వాళ్లందర్నీ కూడా ఆసుపత్రికి తీసుకెళ్లామని అన్నారు. స్లాబు మొత్తం అయిపోయింది, ఫినిషింగ్ చివరి దశలో ఉంది, ఆ టైంలో స్లాబ్ కూలిందని అన్నారు. మూడేళ్లుగా ఈ ఫ్లైఓవర్ కిందనే ఉంటూ ఫ్లైఓవర్ పనులు చేసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బీహార్ కి చెందిన వాళ్లతో పాటు యూపీకి చెందిన వాళ్ళు ఉన్నారని వెల్లడించారు. రోహిత్ తో పాటు జితేందర్ పునీత్ కుమార్ లకు కూడా గాయాలయ్యాయని అన్నారు.
Hair Care Tips: యవ్వనంలోనే మీ జుట్టు తెల్లబడుతోందా?.. ఈ నేచురల్ పద్దతులతో మీ సమస్యకు చెక్ పెట్టండి!